జనసేనాని పవన్‌కల్యాణ్ వ్యక్తిగత, రాజకీయ జీవితంలో అనైతికం ఆయనకు మచ్చగా మిగులుతోంది. అనైతికం ఆయన కేరాఫ్ అడ్రస్‌గా మారింది. పవన్ మనస్తత్వం ఆయన రాజకీయ పంథాను ప్రతిబింబిస్తోంది.
సినిమా హీరోగా పవన్‌ను అభిమానించే వాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అయితే వ్యక్తిగత, రాజకీయ జీవితంలో మాత్రం హీరోకు వ్యతిరేక పాత్ర పోషిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పవన్ నుంచి విడిపోవడానికి దారి తీసిన పరిస్థితుల గురించి రెండో భార్య రేణుదేశాయ్ గతంలో చెప్పిన అంశాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవైపు తనతో కాపురం చేస్తూనే, మరోవైపు ఇంకో యువతితో సహజీవనం చేయడంపై రేణు తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని గుర్తు చేస్తూ, పవన్ అనైతికతను ప్రత్యర్థులను తూర్పారపడుతున్నారు. రాజకీయాల్లో కూడా ఇదే రీతిలో పవన్ ప్రవర్తిస్తున్నారని వైసీపీ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు.
బీజేపీని పెళ్లాడి, విడాకులు తీసుకోకుండానే టీడీపీతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. పెళ్లొకరితో, కాపురం మరొకరితో చేయడం పవన్ ప్రత్యేకంగా ప్రత్యర్థులు సెటైర్స్ విసురుతున్నారు. ఇటీవల వైసీపీ నేతలపై పవన్ అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో, జనసేనాని వ్యక్తిగత, రాజకీయ జీవితాల్ని ముడిపెడుతూ సోషల్ మీడియాలో అధికార పార్టీ అనుకూల నెటిజన్లు ఆడుకుంటున్నారు.
మొదటి భార్యకు రూ.5 కోట్లు, రెండో భార్యకు విడాకులిచ్చే సమయంలో మిగిలిన ఆస్తి ఇచ్చానని పవన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ… బీజేపీకి పవన్ ఎంత భరణం చెల్లిస్తున్నారో అని వెటకారంగా ప్రశ్నిస్తుండడం గమనార్హం. టీడీపీ ఇచ్చే ప్యాకేజీపై బీజేపీ దక్కించుకునే భరణం ఆధారపడి వుంటుందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
పదేపదే పవన్ వ్యక్తిగత జీవితాన్ని ప్రత్యర్థులు టార్గెట్ చేస్తున్నారనేది వాస్తవం. ప్రజాజీవితంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా ఎదుర్కోక తప్పదు మరి!