అర్ధ‌రాత్రి హెచ్చ‌రిక‌… దిక్కుతోచ‌ని స్థితిలో ముంపువాసులు!

బుడ‌మేరుకు ఏ క్ష‌ణంలో అయినా వ‌ర‌ద రావ‌చ్చ‌ని, విజ‌యవాడ‌లోని ముంపు వాసులు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లి వెళ్లాల‌ని ఆదివారం అర్ధ‌రాత్రి నీటిపారుద‌ల విభాగం ఎస్ఈ వార్నింగ్ ఇచ్చారు. దీంతో మ‌ళ్లీ క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ప్ర‌భుత్వం…

బుడ‌మేరుకు ఏ క్ష‌ణంలో అయినా వ‌ర‌ద రావ‌చ్చ‌ని, విజ‌యవాడ‌లోని ముంపు వాసులు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లి వెళ్లాల‌ని ఆదివారం అర్ధ‌రాత్రి నీటిపారుద‌ల విభాగం ఎస్ఈ వార్నింగ్ ఇచ్చారు. దీంతో మ‌ళ్లీ క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ప్ర‌భుత్వం ముంద‌స్తు హెచ్చ‌రిక చేయ‌క‌పోవ‌డం వ‌ల్లే విజ‌య‌వాడ వాసుల‌కు క‌ష్టాలు వ‌చ్చాయ‌ని తీవ్ర విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో ఎస్ఈ అర్ధ‌రాత్రి ప్ర‌క‌ట‌న ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

బుడ‌మేరు ప‌రీవాహ‌క ప్రాంతంలో నిరంత‌రాయంగా వాన‌లు ప‌డుతున్నాయ‌ని, అలాగే భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌నే వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో ఎప్పుడైనా బుడ‌మేరుకు వ‌ర‌ద‌లు రావ‌చ్చ‌నేది ఎస్ఈ వార్నింగ్ సారాంశం.

కావున లోత‌ట్టులో వుండే ఏల‌ప్రోలు, రాయ‌న‌పాడు, గొల్ల‌పూడి, జ‌క్కంపూడి కాల‌నీ, అజిత్‌సింగ్ న‌గ‌ర్‌, గుణ‌ద‌ల‌, రామ‌వ‌ర‌ప్పాడు, త‌దిత‌ర ప్రాంతాలు ముంపున‌కు గుర‌య్యే ప్ర‌మాదం వుంద‌ని, వెంట‌నే ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేయ‌డంతో పాటు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని నీటిపారుద‌ల విభాగం ఎస్ఈ అధికారుల‌ను హెచ్చ‌రించారు.

ఈ వార్నింగ్ అర్ధ‌రాత్రి రావ‌డంతో విజ‌య‌వాడ ముంపు వాసులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. వ‌ర‌ద మిగిల్చిన చేదు అనుభ‌వాలు మ‌న‌సుకు చేసిన గాయాలు మాన‌కుండానే, మ‌ళ్లీ ప్ర‌మాదం వుంద‌న‌డంతో ఏం చేయాలో వాళ్ల‌కు దిక్కుతోచ‌డం లేదు. ఈ వ‌ర‌ద త‌మ‌ను ఎప్పుడు వ‌దిలిపెట్టి పోతుందో తెలియ‌ని ప‌రిస్థితిలో లోత‌ట్టు ప్రాంతాల వాసులున్నారు. అర్ధ‌రాత్రి వేళ అధికారుల హెచ్చ‌రిక‌ల నేప‌థ్యంలో వేళ‌కాని వేళ ఎక్క‌డికి పోవాలో తెలియ‌ని ధైన్య‌స్థితి వారిది.

10 Replies to “అర్ధ‌రాత్రి హెచ్చ‌రిక‌… దిక్కుతోచ‌ని స్థితిలో ముంపువాసులు!”

  1. ప్యాలస్ లో వందల గదులూ ఖాళీ గా వున్నాయి.

    ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల నిమిత్తం స్వాదీనం చేసుకుని, వరద ముంపు ప్రమాదం వున్న వారికి ఆ ప్యాలెస్ లో షెల్టర్ ఇవ్వడమే..

Comments are closed.