శాశ్వత పరిష్కారానికి చంద్రబాబు సిద్ధమేనా?

విజయవాడకు ఇప్పుడు వరద ముప్పు మళ్లీ మళ్లీ రాకుండా ఉండేదుకు శాశ్వత పరిష్కారం గురించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? లేదా? ఈ సందేహం ఇప్పుడు ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. Advertisement వరద బెజవాడను…

విజయవాడకు ఇప్పుడు వరద ముప్పు మళ్లీ మళ్లీ రాకుండా ఉండేదుకు శాశ్వత పరిష్కారం గురించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? లేదా? ఈ సందేహం ఇప్పుడు ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.

వరద బెజవాడను ముంచెత్తినప్పుడు.. సహాయక చర్యల విషయంలో ప్రభుత్వం సమర్థంగానే వ్యవహరించింది. ఒకటి రెండు చోట్ల చివరి ప్రాంతాలకు కాస్త ఇబ్బంది తప్పకపోయినప్పటికీ ఒకటిరెండు రోజుల వ్యవధిలోనే దానిని కూడా సరిదిద్దుకున్నారు. సహాయక చర్యలకు నేవీ హెలికాప్టర్లు రావడం, బుడమేరు గండ్లు పూడ్చడానికి ఏకంగా ఆర్మీ రంగంలోకి దిగడం యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేయడం ఇవన్నీ కూడా అభినందించాల్సిన విషయాలే.

అయితే మళ్లీ మళ్లీ ఇలాంటి ఉపద్రవం తలెత్తకుండా చూడడానికి శాశ్వత పరిష్కారం గురించి చంద్రబాబునాయుడు సిద్ధమేనా? అసలు కారణం ఏమిటో ఆయనకు తెలుసు! దాన్ని పరిష్కరించే ఉద్దేశంతో ఉన్నారా? లేదా? అనేది ఇప్పుడు కీలకం.

చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు రాష్ట్ర గవర్నరు అబ్దుల్ నజీర్ ను కూడా కలిశారు. రాష్ట్రంలో వరద ముప్పు, చేపట్టిన చర్యలు గురించి ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పిన ఒక విషయాన్ని ప్రధానంగా గమనించాలి. బుడమేరు ఆక్రమణ కారణంగా 2.02 లక్షల మంది 8 రోజులకు పైగా నీళ్లలోనే గడిపారు అని చంద్రబాబు పేర్కొన్నారు. చాలా దుర్మార్గమైన పరిస్థితి ఇది.

బుడమేరు కాలువ నిర్వహణ జగన్ హయాంలో జరగనే లేదు… జగన్ వైఫల్యం వల్లనే గండ్లుపడ్డాయి. ఇలాంటి మాటలన్నీ కూడా రాజకీయంగా ప్రత్యర్థులను ఇరుకున పెట్టడానికి బాగానే పనికొస్తాయి. కానీ.. గవర్నరుకు నివేదించిన ప్రకారం.. బుడమేరు ఆక్రమణలకు గురైంది అనే మాట వాస్తవం. ఆ ఆక్రమణలను తొలగించకుండా ఎన్ని చర్యలు చేపట్టినా సరే.. అన్నీ పైపై మెరుగులు అవుతాయే తప్ప శాశ్వత పరిష్కారం కాబోవు.

ఎనిమిది రోజులుగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇన్ని రోజులుగా తాను ఇంటికి కూడా వెళ్లకుండా బస్సులోనే స్నానం చేస్తూ, నివాసం ఉంటున్నానని.. చంద్రబాబు నాయుడు ప్రచారం చేయించుకుంటున్నారు. కానీ, ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా ఆక్రమణలను తొలగిస్తాం అనే మాటమాత్రం చెప్పలేదు.

ఆక్రమణలు తొలగించకుండా ప్రాబ్లం ఎప్పటికీ తీరదు అనే సంగతి.. ఎంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు తెలియదని అనుకోవాలా? లేదా, ఆక్రమణల పేరిట జనం ఇళ్ల మీదకు జేసీబీలు పంపిస్తే.. అందరూ కలిసి తన కరకట్ట నివాసం కూల్చివేతకు దండెత్తి వస్తారని ఆయన భయపడుతున్నారా? అర్థం కావడం లేదు. ఆక్రమణల కూల్చవేతలు చేపట్టకుండా ఎన్ని చేసినా సరే.. అన్నీ పబ్లిసిటీ స్టంట్లు మాత్రమే అవుతాయని చంద్రబాబు గుర్తించాలి.

19 Replies to “శాశ్వత పరిష్కారానికి చంద్రబాబు సిద్ధమేనా?”

  1. చూడు బాబు…ప్రభుత్వాలకు తెలిసిన శాశ్వత పరిష్కారం ఒక్కటే. నగరాలు, పట్టణాల్లోకి వరద ప్రవేశించకుండా 50 అడుగుల ఎత్తున retaining wall నిర్మించడమే! దాని వలన నీటి పారుదల నెమ్మదించి ఎగువ గ్రామాలు, పొలాలు నాశనమైపోయినా, అక్కడి వారు సర్వం కోల్పోయినా ప్రభుత్వాలకు పట్టదు. ఎంతసేపూ నగర పౌరుల సంరక్షణే ధ్యేయం.

  2. Repu nenu kooda jagan ke puttanu Ani cheppina chebutadu…. prastutam veedi concentration motham amaravati ye… Verey di yemi pattinchukodu raasi pettukondi…..eppudu vastaru yellow fools nannu tittadaniki.Dont care

  3. శాశ్వత పరిష్కారం ఒక్కటే, జగన్ను మళ్ళీ సింహాసనం పై కూర్చోపెట్టకూడదు. అరేయ్ జీఏ ఆక్రమణలను నీ ఇంటిని కూల్చటం తోనే మొదలవుతుంది. ఎర్రి సన్నాసి, నిన్న గాక మొన్న వొచ్చిన వరదకు ఈ రోజుకు ఈ రోజు పరిష్కారం దొరుకుతుందా? ఎంత సేపు సీబీన్ ఇల్లు కూల్చే యోచన లో ఉన్నావు ఎధవ?

  4. శాశ్వత పరిష్కారం ఒక్కటే, జగన్ను మళ్ళీ సింహాసనం పై కూర్చోపెట్టకూడదు. అరేయ్ జీఏ ఆక్రమణలను నీ ఇంటిని కూల్చటం తోనే మొదలవుతుంది._ఎర్రి_సన్నాసి, నిన్న గాక మొన్న వొచ్చిన వరదకు ఈ రోజుకు ఈ రోజు పరిష్కారం దొరుకుతుందా? ఎంత సేపు సీబీన్ ఇల్లు కూల్చే యోచన లో ఉన్నావు_ఎధవ?

  5. శాశ్వత పరిష్కారం ఒక్కటే, జగన్ను మళ్ళీ సింహాసనం పై కూర్చోపెట్టకూడదు._అరేయ్ జీఏ_ఆక్రమణలను నీ ఇంటిని_కూల్చటం తోనే మొదలవుతుంది._ఎర్రి_సన్నాసి, నిన్న గాక మొన్న వొచ్చిన వరదకు ఈ రోజుకు ఈ రోజు పరిష్కారం దొరుకుతుందా? ఎంత సేపు సీబీన్ ఇల్లు_కూల్చే_యోచన లో ఉన్నావు_ఎధవ?

  6. GA కు బుర్ర ఉంది. అప్పుడప్పుడు మాత్రమే అది వాడుతుంటాడు. ఆక్రమణలు తొలగిస్తేనే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడొచ్చు.

  7. Realistically it is not easy to demolish once the structures are in place . The people who lost the structures will never forget it and will always vote to the opposition. But who ever benefits from these expansions may not even recognise it . All political parties want to stay in power and this is a political sucide.

Comments are closed.