పిఠాపురానికి ముంపు… ప‌వ‌న్ ఆగ‌మేఘాల‌పై!

సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన పిఠాపురానికి ముంపు పొంచి వుంద‌ని తెలియ‌గానే ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆగ‌మేఘాల‌పై క‌దిలారు. విజ‌య‌వాడ‌కు క‌ష్ట‌మొస్తే మాత్రం.. తాను అగ్ర‌హీరో అని, జ‌నంలోకి వెళితే స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఆటంకం ఏర్ప‌డుతుంద‌ని అధికారులు…

సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన పిఠాపురానికి ముంపు పొంచి వుంద‌ని తెలియ‌గానే ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆగ‌మేఘాల‌పై క‌దిలారు. విజ‌య‌వాడ‌కు క‌ష్ట‌మొస్తే మాత్రం.. తాను అగ్ర‌హీరో అని, జ‌నంలోకి వెళితే స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు ఆటంకం ఏర్ప‌డుతుంద‌ని అధికారులు చెప్పార‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఏవేవో క‌బుర్లు చెప్పిన సంగ‌తి తెలిసిందే. ఇదే పిఠాపురానికి వ‌ర‌ద ముంపు వ‌స్తుంద‌ని తెలియ‌గానే, ఆయ‌న ఇంట్లోనే కూచోలేదు.

వెంట‌నే కాకినాడ క‌లెక్ట‌ర్ షాన్‌మోహ‌న్‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఫోన్ చేశారు. ఏలేరు రిజ‌ర్వాయ‌ర్ నీటిని విడుద‌ల చేస్తే పిఠాపురం ప‌రిధిలో ముంపు తీవ్రంగా వుంటుంద‌ని, వెంట‌నే అక్క‌డి ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేయ‌డంతో పాటు సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని ఫోన్‌లోనే క‌లెక్ట‌ర్‌, ఇత‌ర అధికారుల‌కు ఆయ‌న ఆదేశాలు ఇవ్వ‌డం విశేషం. సొంత నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌పై ఆయ‌న చూపుతున్న శ్ర‌ద్ధ‌ను త‌ప్ప‌క అభినందించాలి.

తుపాను ప్ర‌భావంతో కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు ఏలేరు రిజ‌ర్వాయ‌ర్‌కు వ‌ర‌ద బాగా పెరుగుతోంది. దీంతో ఆ నీళ్ల‌ను విడుద‌ల చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కాకినాడ‌కు ప‌వ‌న్ వెళుతున్నారు. ఇవాళ ఆయ‌న కాకినాడ క‌లెక్ట‌రేట్‌లో అధికారుల‌తో స‌మీక్షించ‌నున్నారు. అనంత‌రం ఏలేరు ప‌రిధిలోని ముంపు ప్రాంతాల‌ను ప‌రిశీలిస్తారు. ముంపు ఏ స్థాయిలో వుంటుందో అధికారుల్ని అడిగి తెలుసుకోనున్నారు.

విజ‌య‌వాడ‌లో ఎదురైన చేదు అనుభ‌వాల దృష్ట్యా ఏలేరు రిజ‌ర్వాయ‌ర్ ప‌రిధిలోని ముంపు ప్రాంతవాసుల్ని సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని ఉప ముఖ్య‌మంత్రి ఆదేశాలు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జానీకానికి ఎలాంటి వ‌రద క‌ష్టం రాకూడ‌ద‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

29 Replies to “పిఠాపురానికి ముంపు… ప‌వ‌న్ ఆగ‌మేఘాల‌పై!”

  1. ఎమిటొ GA ఎడుపు? ఇంతకీ జగన్ వచ్చాడా, బెంగళూరు ప్యాలెస్స్ లొ తొంగున్నాడా

  2. 6 crs సొంత డబ్బు ప్రజలకు ఇచ్చినదానికి కూడా , ఏడవడం ఒక్కటే balance GA…. ఐనా ప్రజలకు మంచి చేస్తున్నా కూడా ఇంత కడుపు మంట ఎందుకు GA…

  3. పవన్ 6 కోట్లు విరాళం ఇచ్చాడు.

    పవన్ కంటే వందల రెట్లు ఆస్తి పరుడైన జగన్ ఎంత ఇచ్చాడు ? సి*గ్గు సి*గ్గు. షే*మ్ షే*మ్.

  4. మీ ఛానెల్ పేరు గ్రేట్ ఆంధ్ర అని కాకుండా JBC అంటే జగన్ బ్రోతల్ ఛానెల్ అని పెట్టుకుని వుంటే బాగుండేది

  5. విజయవాడ లో బాబు స్వయానా పర్యవేక్షిస్తున్నప్పుడు పవన్ తో పని ఏముంది , అందుకే వేరే చోటకి ముందు గ వెళ్ళాడు.

    విజయవాడ లో అవసరాన్ని బట్టి మనోహర్ రేషన్ ఏర్పాట్లు చూసాడు.

    అసలు రాష్ట్రము మొత్తం నుంచి బియ్యం, పప్పు దినుసులు, కాయగూరలు వెయ్యికి పైగా లారీలలో తెచ్చి 2000 రేషన్ వెహికల్స్ లో తరలించి ఇస్తే, నువ్వు ఒక ఆర్టికల్ కూడా రాయలేదు అంటే, ఎంత కడుపు ఉబ్బు తో ఉన్నవో తెలుస్తుంది. అది కాకుండా, బాబు నాదెండ్ల ని తిట్టాడు అని సాక్షి లో ప్రచారం చేస్తున్నారు.

Comments are closed.