న్యాయమూర్తులు అంటే రాజ్యాంగానికి ప్రతిరూపాలు. ఒక న్యాయమూర్తి నగరానికి వస్తారు అంటేనే ఎక్కడ లేని ప్రోటోకాల్ అటెన్షన్ ఉంటుంది. అలాంటిది పదుల సంఖ్యలో న్యాయమూర్తులు సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖకు వస్తున్నారు. ముప్పయి మంది జడ్జీలు స్మార్ట్ సిటీలో సాగరతీరంలో ఒక రోజంతా గడపబోతున్నారు.
హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీ సోమయాజులు కుమార్తె వివాహం విశాఖలో ఈ నెల 18న అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వివాహానికి ఆంధ్ర తెలంగాణా, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలను నుంచి పదుల సంఖ్యలో న్యాయమూర్తులు అతిధులుగా విశాఖకు రాబోతున్నారు.
దాంతో విశాఖ సాగర తీరం పటిష్ట భద్రతతో కట్టుదిటమైంది. విశాఖ బీచ్ లో ఉన్న ఒక ప్రముఖ హొటల్ లో వచ్చిన న్యాయమూర్తులు అందరికీ విడిదిని ఏర్పాటు చేశారు. వారికి అధికారిక పరమైన లాంచనాలు ప్రోటోకాల్ ఉండడంతో విశాఖ పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేస్తున్నారు.
ఏపీ హై కోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా సతీసమేతంగా ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. అసలే వీకెండ్ దానికి తోడు వీవీఐపీ అథిధులు కావడంతో విశాఖ రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలతో బంధీ అయిపోతోంది. ఇంతమంది న్యాయమూర్తులు ఒకేసారి విశాఖకు రావడం మాత్రం అరుదైన ఘటనగా చెప్పుకోవాలి.