హ్యాపీ న్యూ ఇయర్ అంటూ మత్తు పదార్ధాలతో దిగిపోయారు

వేడుకను ఉత్సాహంగా చేసుకోవాలి. కేరింతలు తుళ్ళింతలతో పండుగ ఏదైనా సాగాలి. రాను రానూ కల్చర్ మారుతోంది. ఏదైనా సెలబ్రేషన్ ఉంటే గింటే దాన్ని మత్తుతో గమ్మత్తుగా చిత్తు కావడం కోసమే చేసుకుంటున్నారు. మత్తు కోసం…

వేడుకను ఉత్సాహంగా చేసుకోవాలి. కేరింతలు తుళ్ళింతలతో పండుగ ఏదైనా సాగాలి. రాను రానూ కల్చర్ మారుతోంది. ఏదైనా సెలబ్రేషన్ ఉంటే గింటే దాన్ని మత్తుతో గమ్మత్తుగా చిత్తు కావడం కోసమే చేసుకుంటున్నారు. మత్తు కోసం పండుగలు కూడా క్రియేట్ చేస్తుకుంటున్న కాలమిది.

మరి కొద్ది రోజుల్లో 2023 వస్తుంది. న్యూ ఇయర్ వేడుకల కోసం కొందరు యువకులు బెంగుళూరు నుంచి విశాఖకు భారీ ఎత్తున డ్రగ్స్ ని తీసుకువచ్చారు. న్యూ ఇయర్ కి యువత రెడీ అవుతోంది. వారికి డ్రగ్స్ అమ్మడం ద్వారా మంచి గిరాకీ అయిన బేరం పట్టేద్దామనుకున్నారు.

డ్రగ్స్ బిజినెస్ కోసం ఆరు లక్షల విలువ చేసే డ్రగ్స్ ని బెంగుళూరు టూ విశాఖకు తరలించి అమ్మకాలు స్టార్ట్ చేశారు. ఈ గుట్టు కాస్తా మెల్లగా రట్టు అయింది. విశాఖ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి మరీ నలుగురు యువకులను పట్టుకున్నారు. వారి నుంచి క్రిస్టల్ మేడ్ ఎం అనే రకం డ్రగ్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని మాదక ద్రవ్యాల ముఠాలు కూడా సిటీలో సందడి చేయవచ్చు అన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ బృందాలు సెర్చ్ మొదలెట్టారు. డ్రగ్స్ కి అడిక్ట్ అయ్యేలా యువతను చేస్తూ తమ వ్యాపారాన్ని సూపర్ హిట్ చేసుకుంటున్న ముఠాల మీదనే పోలీసుల టార్గెట్ అంటున్నారు.