ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీని బాగా వాడుకుంటున్న వారిలో సూటుబూటు సార్ మొట్టమొదటివాడు. న్యాయ వ్యవస్థలో పని చేస్తూ సస్పెండ్‌కు గురైన ఆయన గారు అంబేద్కర్ పేరును అడ్డు పెట్టుకుని వీలైన మేరకు దోచుకుంటున్నాడు. ప్రతిరోజూ ఎల్లో చానళ్లలో ఆయన లేకపోతే డిబేట్లు నడవవనే పరిస్థితి తెచ్చాడు. ఒక రాజకీయ పార్టీని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. సొంత పార్టీ అయితే పెట్టుకున్నాడే గానీ, ఆయనకు ప్రజలతో సంబంధం లేదు.
ప్రజలతో కాకుండా ఎల్లో మీడియాతో మమేకం కావడంలోనే ఉనికి చాటుకుంటున్నాడు. ఇప్పుడాయనకు కష్టం వచ్చి పడింది. అది కూడా హైకోర్టు సానుకూల ఆదేశాలతో ఇబ్బందులు ఎదురు కావడం చర్చనీయాంశమైంది. సదరు సూటుబూటు సార్ అగచాట్లను దగ్గరగా చూస్తున్న తోటి సామాజిక వర్గ నాయకులు …అయ్యో అని వెటకారంతో కూడిన సానుభూతి చూపి నవ్వుకుంటున్నారు.
రాజధాని పేరుతో ఆయన రాజకీయంగా సొమ్ము చేసుకునే క్రమంలో ఆ మధ్య పాదయాత్రకు పిలుపునిచ్చాడు. ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించాడు. ఈ నెల 8న పాదయాత్ర నిర్వహించుకునేందుకు అనుమతి ఇస్తూ షరతులు విధించింది. అదేంటయ్యా అంటే… పాదయాత్రలో 200 మంది మాత్రమే పాల్గొనాలని, వారందరి ఆధార్‌కార్డు వివరాలు ఇవ్వాలనేది షరతు.
దీంతో 200 మంది వివరాలు పోలీసులకు ఇచ్చేందుకు సూటుబూటు సార్‌కు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే ఈయన గారికేమో డిబేట్లకు ఆహ్వానించే ఎల్లో మీడియా ప్రజెంటర్లతో తప్ప మరే ప్రజానీకంతో కనీస మానవ సంబంధాలు లేకపాయె. మరి 200 మందితో పాదయాత్ర నిర్వహించడం అంటే న్యాయస్థానంలో పిటిషన్ వేసినంత సులువు కాదని అనుభవంలోకి వచ్చింది. చివరికి టీడీపీ నాయకులతో మాట్లాడుకుని పాదయాత్రకు జనాన్ని సమీకరించుకోవాల్సిందేమో అని ఎల్లో చానళ్ల అనలిస్టులు వెటకరిస్తున్నారు.