అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 12న చేపట్టనున్న మహాపాదయాత్రను ఇవాళ హైకోర్టు అనుమతి ఇచ్చింది. గతంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న కారణంతో డీజీపీ అనుమతి నిరాకరించడంతో అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టును అశ్రయించడంతో కోర్టు పాదయాత్రకు అనుమతిచ్చింది.
అమరావతి పరిరక్షణ సమితి పేరుతో అమరావతికి సంబంధించిన కొంత మంది రైతులు అమరావతి నుండి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు ఈ నెల 12నుండి దాదాపు 60 రోజుల పాటు పాదయాత్ర చేయనున్నారు.
గత ఏడాది కూడా అమరావతి నుండి తిరుమల దేవస్థానం వరకు అమరావతి పరిరక్షణ సమితి పాదయాత్ర చేశారు. అప్పట్లో దారి వెంబడి టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. పాదయాత్రలో సీఎం జగన్ ను వ్యక్తిగతంగా తిడుతూ చంద్రబాబును పొగుడుతూ పాదయాత్ర సాగించారు.
ఈ నెల 12 నుండి మొదలు కానున్న పాదయాత్రలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఎక్కువగా పాల్గొనే ఆవకాశలు ఉన్నాయి. కేవలం ఆమరావతిలో మాత్రమే అభివృధి జరగాలనే అజెండాతో చంద్రబాబు నాయుడు వెనుక ఉండి పాదయాత్రను చేపిస్తున్నరంటూ వైసీపీ నేతల నుండి వస్తున్నా విమర్శలు.