పైడితల్లమ్మ పండుగకు పిలుపులు

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, విజయనగరం ఇలవేలుపు అయిన శ్రీ పైడితల్లి అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం ఈ నెల 14, 15 తేదీలలో విజయనగరంలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ ఉత్సవాలకు భారీ…

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం, విజయనగరం ఇలవేలుపు అయిన శ్రీ పైడితల్లి అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం ఈ నెల 14, 15 తేదీలలో విజయనగరంలో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ ఉత్సవాలకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఉత్సవాలలో సిరిమాను జాతర ప్రత్యేకంగా ఉంటుంది. జాతీయ స్థాయిలో కూడా ఈ సిరిమాను ఉత్సవం అందరికీ అలరిస్తుంది. దీంతో విజయనగరం జిల్లాలో ఈసారి కొత్తగా ఎన్నికైన కూటమి ప్రజా ప్రతినిధులు ఈ ఉత్సవాల కోసం ఢిల్లీ నుంచి ఏపీ స్థాయి వరకూ ప్రభుత్వ పెద్దలను ప్రముఖులను ప్రత్యేకంగా రమ్మని పిలవడం విశేషం.

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆహ్వానపత్రికను అందచేస్తూ ఉత్సవాలకు తప్పనిసరిగా రావాలని ఆహ్వానించారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులను కూడా పిలిచారు. ఏపీ మంత్రులు, సీఎం తో పాటు కీలక నాయకులను ఎంపీ కలిశెట్టితో పాటు మంత్రి కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం ఎమ్మెల్యే అతిధి గజపతిరాజు పేరు పేరునా ఆహ్వానిస్తున్నారు. ఈ ముగ్గురూ ఒక బృందంగా మారి ఈ పిలుపుల ప్రక్రియను నిర్వహిస్తున్నారు.

ఈసారి అతిథులు జాతీయ, రాష్ట్ర స్థాయి నుంచి ఎంత మంది వస్తారో అన్నది అంతా తర్కించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తొలిసారి జరుగుతున్న మహోత్సవాలు కావడంతో ప్రతిష్టగానే తీసుకున్నారు. లక్షలాది మంది భక్తులు ఉత్తరాంధ్రతో పాటు ఒడిషా ఇతర సమీప రాష్ట్రాల నుంచి తరలివస్తున్నారు.

5 Replies to “పైడితల్లమ్మ పండుగకు పిలుపులు”

  1. పైడి తల్లి ని ఇండస్ వ్యాలీ నాగరికత అప్పుడు అమ్మ తల్లి అనేవారు ఈ ఆచారం కొన్ని వేల సంవత్సరాలుగా కొనసాగుతుంది ప్రకృతిని భూమిని పూజిస్తారు

  2. ఆ సనాతన ధర్మం సంగతేమో గానీ మొదట shops, hotels కు పెట్టే boards కి గుడుల వద్ద పెట్టే boards కి తేడా చూపించాలి. Same styling మరియు font వాడేస్తున్నారు.

  3. ఆ సనాతన ధర్మం సంగతేమో గానీ మొదట shopsx, hotelsx కు పెట్టే boardsx కి గుడుల వద్ద పెట్టే boardsx కి తేడా చూపించాలి. Same stylingg మరియు fontt వాడేస్తున్నారు.

Comments are closed.