ఐవైఆర్ ట్వీట్ భూమ‌రాంగ్‌!

ఏపీ ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, బీజేపీ సీనియ‌ర్ నేత ఐవైఆర్ కృష్ణారావు సోష‌ల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు ప్ర‌ధాని మోదీని బద్నాం చేస్తోంది. ఐవైఆర్ కృష్ణారావు పోస్టు భూమ‌రాంగ్ అయ్యింది. ఆద‌రించే…

ఏపీ ప్ర‌భుత్వ మాజీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, బీజేపీ సీనియ‌ర్ నేత ఐవైఆర్ కృష్ణారావు సోష‌ల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు ప్ర‌ధాని మోదీని బద్నాం చేస్తోంది. ఐవైఆర్ కృష్ణారావు పోస్టు భూమ‌రాంగ్ అయ్యింది. ఆద‌రించే వాళ్ల‌కే  ఐవైఆర్ సున్నం పెడ‌తార‌నే పేరుంది. దీంతో ఆయ‌న్ను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ దూరం పెట్టారు. ఈ నేప‌థ్యంలో ఐవైఆర్ బీజేపీ పంచ‌న చేరారు.

తాజాగా ఈనాడు ప‌త్రిక‌లో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా వ‌చ్చిన ఓ క‌థనాన్ని తీసుకుని, ఓ ట్వీట్ చేశారు. అదేంటంటే…

“ఇంత మాత్రం తెలివితేటలు ఇంతకు ముందు ముఖ్యమంత్రులకు లేకపోయె. ఉండి ఉంటే తాకట్టు పెట్టటానికి ఏమి మిగులు ఉండేది కాదు. వ్రతం చెడిన ఫలం దక్కేటట్టు లేదు. ఇంకా ఒకటిన్నర సంవత్సరం నెట్టాలి. అంతా తాకట్టు పెట్టిన రుణాలు పుట్టేటట్టుగా లేవు. మధ్యంతరమే గతేమో”

ట్వీట్‌తో పాటు ఈనాడులో “ఉత్త‌రాంధ్ర‌పై ప్రేమంలే… భూముల తాక‌ట్టా?” అనే శీర్షిక‌తో ప్ర‌చురిత‌మైన క‌థ‌నాన్ని షేర్ చేయ‌డం గ‌మ‌నార్హం. విశాఖ‌, చుట్టుప‌క్క‌లున్న ప్ర‌భుత్వ భూముల‌ను త‌న‌ఖా పెట్టి రూ.23 వేల కోట్లు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అప్పు తెచ్చార‌నేది ఆ క‌థ‌నం సారాంశం.

ప్ర‌భుత్వ భూముల‌ను ఏపీ ప్ర‌భుత్వం తాక‌ట్టు పెట్ట‌డ‌మే త‌ప్పు అయితే, మ‌రి ప్ర‌ధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం ఏకంగా ప్ర‌భుత్వ భూముల్ని, సంస్థ‌ల్ని అమ్మ‌డాన్ని ఏమ‌నాలి? అంటూ నెటిజ‌న్లు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అయ్యా ఐవైఆర్ గారూ… విశాఖ‌లో ఉక్కు ప‌రిశ్ర‌మ‌ను అమ్మ‌కానికి పెట్టింది జ‌గ‌న్ ప్ర‌భుత్వం కాదు…మీ పార్టీకి చెందిన మోదీ ప్ర‌భుత్వ‌మ‌ని నెటిజ‌న్లు గుర్తు చేస్తూ దెప్పి పొడుస్తున్నారు.

భార‌త‌దేశంలో ప‌రిశ్ర‌మ‌లు, ప్ర‌భుత్వ భూముల గురించి మోదీకి ముందు, ఆ త‌ర్వాత అని చ‌ర్చించుకోవాల్సిన దుస్థితి గురించి నెల‌కుంద‌ని ఐవైఆర్‌కు హిత‌వు ప‌ల‌క‌డం గ‌మ‌నార్హం. నిరుప‌యోగ ప్ర‌భుత్వ భూముల్ని జ‌గ‌న్ తాక‌ట్టు మాత్ర‌మే పెట్టార‌ని, మీ ప్ర‌ధాని మోదీ మాత్రం ఏకంగా దేశాన్ని అమ్మ‌కానికి పెట్టార‌నే సంగ‌తి మ‌రిచిపోవ‌ద్దు ఐవైఆర్ అంటూ నెటిజ‌న్లు సెటైర్స్ విసురుతున్నారు.

దేశంలోని ప్ర‌తిష్టాత్మ‌క ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్ సంస్థ‌ల స్థ‌లాల అమ్మ‌కం, ప్రైవేట్‌ప‌రం చేయాల‌నే తెలివితేట‌లు మోదీకి ముందు ప్ర‌ధానులెవ‌రికీ లేవ‌ని, ఉంటే ఈ పాటికి దేశం ఏమ‌య్యేదో అని ఐవైఆర్ ట్వీట్ నుంచే తీసుకుని నెటిజ‌న్లు కుళ్ల‌బొడ‌వ‌డం విశేషం. పెద్దాయ‌న ఐవైఆర్ రామ, కృష్ణా అనుకుంటూ శేష జీవితం గ‌డ‌ప‌కుండా ఎందుకీ వివాదాలంటూ మ‌రికొంద‌రు సానుభూతి ప్ర‌ద‌ర్శించ‌డం గ‌మ‌నార్హం.