ఆయన అన్నయ్య పోయిన చోటనే వెదుక్కుంటాడట

పోయిన చోటనే వెదుక్కోవాలని అంటూ ఉంటారు పెద్దలు. దీని అర్ధం ఏమిటంటే అపజయం ఎదురైన చోటనే విజయం సాధించాలని. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన రెండో అన్నయ్య నాగబాబు ఈ మాటను గట్టిగా…

పోయిన చోటనే వెదుక్కోవాలని అంటూ ఉంటారు పెద్దలు. దీని అర్ధం ఏమిటంటే అపజయం ఎదురైన చోటనే విజయం సాధించాలని. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆయన రెండో అన్నయ్య నాగబాబు ఈ మాటను గట్టిగా పట్టుకున్నారట. పోయిన చోటనే వెదకాలి అనే నిర్ణయానికి వచ్చారట. అసలు విషయం ఏమిటంటే …గత ఎన్నికల్లో నాగబాబు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

అయినప్పటికీ పవన్ కళ్యాణ్ అన్నయ్యను వచ్చే ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని అనుకుంటున్నట్లు సమాచారం. వాస్త‌వానికి నాగ‌బాబుకు అదే తొలి ఎన్నిక. అందునా క్ష‌త్రియ సామాజిక వ‌ర్గం హ‌వా ఎక్కువ‌గా ఉన్న ఈ నియాజకవర్గంలో ఆయ‌న పోటీ మ‌రింత ఆసక్తిగా మారింది. గ‌ట్టి పోటీ ఇస్తారులే అనుకుంటే ఆయ‌న పెద్ద‌గా పోటీ ఇవ్వ‌లేక పోయారు. ఈ క్ర‌మంలో 2 ల‌క్ష‌ల 50 వేల ఓట్లు సాధించారు. అయితే, వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసిన ర‌ఘురామ‌కు 4ల‌క్ష‌ల 47 వేల ఓట్లు వ‌స్తే, టీడీపీకి రెండో స్థానం ద‌క్కింది. ఈ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసిన శివ‌రామ‌రాజుకు 4 ల‌క్ష‌ల 15 వేల ఓట్లు వ‌చ్చాయి. 

దీంతో నాగ‌బాబు థ‌ర్డ్ ప్లేస్‌కు జారి పోయారు. ఇక‌, ఆ తర్వాత పెద్ద‌గా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించింది లేదు. అయిన‌ప్ప‌టికీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడిన చోటే గెల‌వాల‌నే ప‌ట్టుతో ఉన్నార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల ఇదిలా వుంటే, తాజాగా న‌ర‌సాపురం టికెట్‌మ‌ళ్లీ నాగ‌బాబుకే కేటాయించిన‌ట్టు తెలుస్తోంది. నేరుగా ప‌వ‌న్ ఈ విష‌యాన్ని చెప్ప‌క‌పోయినా.. తాజాగా జ‌రిగిన పీఏసీ స‌మావేశంలో ప‌శ్చిమ గోదావ‌రి విష‌యం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. ఈ స‌మ‌యంలో ఈ జిల్లాలో ఉన్న ఏకైక నియోజ‌క వ‌ర్గంలో వైసీపీ దూకుడు ఎక్కువ‌గా ఉంద‌ని క‌నీసం త‌మ‌ను బ్యాన‌ర్లు కూడా క‌ట్ట‌నివ్వ‌డం లేదని జన‌సేన నాయ‌కులు ఫిర్యాదు చేశారు. 

దీంతో ప‌వ‌న్ స్పందిస్తూ.. అదంతా నాగ‌బాబు చూసుకుంటాడులే. త్వ‌ర‌లోనే ఆయ‌న వ‌స్తారు. అని చెప్పార‌ట‌. దీంతో ఈ టికెట్‌ను ఆయ‌న‌కే కేటాయించే అవ‌కాశం ఉంద‌ని జ‌న‌సేన వ‌ర్గాల్లో చ‌ర్చ‌సాగుతోందట. అయితే, ఆయ‌న గ‌త అనుభ‌వాల దృష్ట్యా ఇప్ప‌టి నుంచి లైన్‌క్లియ‌ర్ చేసుకునేలా ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పైగా క్ష‌త్రియ వ‌ర్గాన్ని మెప్పించాలి. కాపు ఓట్లు ఉన్నా.. డామినేష‌న్ మాత్రం క్ష‌త్రియుల‌దే కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి నాగ‌బాబు ఏం చేస్తారో చూడాలి.