జగన్ తరువాతే ఎవరైనా …?

జగన్ కి తెలుగు అంటే ఎంతటి మమకారమో తెలుగు భాషా దినోత్సవం వేళ రుజువు అయింది. తెలుగు భాషను ఏపీలో అంతటా అమలు జరిపేలా ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్రంలో అన్ని దుకాణాలు,…

జగన్ కి తెలుగు అంటే ఎంతటి మమకారమో తెలుగు భాషా దినోత్సవం వేళ రుజువు అయింది. తెలుగు భాషను ఏపీలో అంతటా అమలు జరిపేలా ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్రంలో అన్ని దుకాణాలు, సంస్థల బోర్డులు కూడా తెలుగులోనే ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

తెలుగు అమలుని ప్రభుత్వ ఆఫీసులతో పాటు వివిధ వ్యవస్థలలో తెలుగు అమలు తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. ఒకవేళ అలా అమలు చేయలేకపోతే కనుక జరీమానా తో పాటు జైలు శిక్ష కూడా ఉంటుందని పెర్కొంది.

ఇక తెలుగు ప్రాధికారిక సంస్థను ఏర్పాటు చేసి ఏపీలో తెలుగు సక్రమంగా అమలు జరిగేలా ప్రభుత్వం చర్యలను తీసుకోనుంది. ఇదిలా ఉండగా ఏపీలో ఎన్టీయార్, వైఎస్సార్, జగన్ ఈ ముగ్గురూ తెలుగు వెలుగులను చాటిన ముఖ్యమంత్రులని అని అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చెప్పడం విశేషం.

తెలుగు భాషాభివృద్ధికి జగన్  తీసుకుంటున్న చర్యలు గతంలో ఎవరూ తీసుకోలేదని, నెల్లూరులో తెలుగు అధ్యయన కేంద్రానికి అయిదు ఎకరాలు కేటాయించిన జగన్ ఏపీలో తెలుగు వెలుగులు నిండుగా నింపారని ఆయన కొనియాడారు.  

జగన్ తెలుగునకు వ్యతిరేకం అంటూ కొందరు చేస్తున్న విమర్శలకు ఇది ధీటైన జవాబు అని వైసీపీ నేతలు అంటున్నారు. నిన్న ప్లాస్టిక్ నిషేధం, నేడు తెలుగు భాష అమలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో తన తరువాతే ఎవరైనా అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాటి చెబుతున్నారు.