కొత్త జిల్లాల విభజన తరువాత పాడేరు జిల్లాగా మారిపోయింది. పాడేరు కేంద్రంగా ఏర్పాటు అయిన అల్లూరి సీతారామరాజు జిల్లా పూర్తిగా ఆదివాసీలు గిరిజనుల కోటగా ఉంటుంది.
ఏజెన్సీ కోసం ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలన్న దశాబ్దాల వినతిని జగన్ పట్టించుకుని వారికి ఆ అపురూపమైన వరం ఇచ్చారు.
ఇదిలా ఉండగా గిరిజనుల అతి పెద్ద పండుగ అయిన ఆదీవాసీ దినోత్సవాన్ని ఈసారి పాడేరు వేదికగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో జరిపే ఈ వేడుకకి అల్లూరి జిల్లాను ఎంచుకోవడం ద్వారా గిరిపుత్రుల పట్ల తన మమతానురాగాలను వైసీపీ సర్కార్ గట్టిగా చాటుకుంది.
ఈ నెల 9న జరిగే ఆదివాసీ ఉత్సవాలకు ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరవుతున్నారు. ఆ విధంగా పాడేరుకే ఆయన పండుగ తేనున్నారు. కొత్త జిల్లా ఏర్పడిన తరువాత తొలిసారి ఏజెన్సీ పర్యటన చేస్తున్న జగన్ గిరిపుత్రులకు ఏ రకమైన వరాలు ప్రకటిస్తారు అన్న ఆసక్తి అంతటా ఉంది.
ముఖ్యమంత్రి జగన్ పాడేరు టూర్ కోసం అధికారులు అన్ని రకాలైన ఏర్పాట్లను చేస్తున్నారు. సీఎం ఏజెన్సీ టూర్ కావడంతో భద్రతాపరంగా కూడా తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటున్నారు.