జగన్ వెనకే చంద్రబాబు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ ఆగస్ట్ ఫస్ట్ నే ముహూర్తం పెట్టుకుని వస్తున్నారు. ఈసారి జగన్ విశాఖలో అనేక కార్యక్రమాలలో పాల్గోనేందుకు ఎక్కువ సమయం వెచ్చించనున్నారు. జగన్ విశాఖ టూర్ ద్వారా అభివృద్ధిని…

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ ఆగస్ట్ ఫస్ట్ నే ముహూర్తం పెట్టుకుని వస్తున్నారు. ఈసారి జగన్ విశాఖలో అనేక కార్యక్రమాలలో పాల్గోనేందుకు ఎక్కువ సమయం వెచ్చించనున్నారు. జగన్ విశాఖ టూర్ ద్వారా అభివృద్ధిని తమ ప్రభుత్వం చేస్తోంది. అని చెప్పుకోవడానికి వైసీపీ చూస్తోంది.

జగన్ ఇలా వెళ్లీ వెళ్లగానే మరుసటి వారమే టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ వస్తున్నారు. ఆయన ఆగస్ట్ 7, 8 తేదీలలో ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనకు షెడ్యూల్ ఖరారు చేశారు. విశాఖ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శన అంటూ బాబు ఒక కొత్త కార్యక్రమం పెట్టుకున్నారు.

రూరల్ జిల్లాలోనే చంద్రబాబు రెండు రోజుల పాటు పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలియచేశాయి. జగన్ విశాఖ కార్యక్రమాలలో ప్రసంగంలో టీడీపీ మీద గురి పెట్టడం ఖాయం. విశాఖ పట్ల తమకు ఉన్న కమిట్మెంట్ ని సీఎం జగన్ తప్పకుండా చెబుతారు అని అంటున్నారు.

చంద్రబాబు స్పీచులు తెలిసిందే. విశాఖ తమకు కంచుకోటని, ఉత్తరాంధ్రా అభివృద్ధి తమ తరువాతే అని ఆయన చెప్పడం అనవాయితీ. ఎన్నికలు మరింతగా ముందుకు వస్తున్న తరుణంలో చంద్రబాబు వైసీపీ సర్కార్ మీద వాడి వేడి విమర్శలకు దిగుతారు అని అంటున్నారు.

వారం తేడాలో వస్తున్న ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు విశాఖ జిల్లా రాజకీయాలను మంటెక్కిస్తారు అని అంటున్నారు.