హ‌మ్మ‌య్య‌… జ‌గ‌న్ మొండిత‌నం వీడుతోంది!

ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం నేప‌థ్యంలో వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిలో మొండిత‌నం వీడుతోందా? అంటే.. ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. ఇంత‌కాలం జ‌గ‌న్ రాజ‌కీయంగా మ‌డి క‌ట్టుకుని కూచున్నారు. రాజ‌కీయాల్లో ఇది స‌రైన విధానం…

ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం నేప‌థ్యంలో వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిలో మొండిత‌నం వీడుతోందా? అంటే.. ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. ఇంత‌కాలం జ‌గ‌న్ రాజ‌కీయంగా మ‌డి క‌ట్టుకుని కూచున్నారు. రాజ‌కీయాల్లో ఇది స‌రైన విధానం కాద‌ని వైసీపీ నేత‌లు చెప్పినా, జ‌గ‌న్ వినిపించుకోలేదు. ప్ర‌ధాని మోదీతో పాటు కేంద్ర పెద్ద‌ల‌తో సాన్నిహిత్యం వ‌ల్ల ఇత‌ర పార్టీల‌కు వైసీపీ చేరువ కాలేక‌పోయింది.

అయితే రాజ‌కీయాల్లో ప్ర‌జాద‌ర‌ణ పొందినంత వ‌ర‌కే ఎవ‌రైనా ద‌గ్గ‌రికి తీస్తార‌నే, అవ‌స‌రం లేద‌నుకుంటే దూరం పెడ‌తార‌నే జ్ఞానోద‌యాన్ని జ‌గ‌న్‌కు ఎన్నిక‌ల ఫ‌లితాలు క‌లిగించాయి. జాతీయ‌స్థాయిలో వైసీపీకి ఒక వేదిక‌, మ‌ద్ద‌తు ఉండాల‌ని జ‌గ‌న్ భావించారు. దీంతో ఎన్డీఏకు వ్య‌తిరేకంగా కూట‌మి క‌ట్టి, పోరాడుతున్న ఇండియా కూట‌మిలోని పార్టీల‌తో క‌లిసి ప‌ని చేయ‌డానికి జ‌గ‌న్ నిర్ణ‌యించ‌డం విశేషం.

జ‌గ‌న్‌లోని ఈ మార్పుపై వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఢిల్లీలో వైసీపీ చేప‌ట్టిన ధ‌ర్నాకు అఖిలేష్‌యాద‌వ్‌, మ‌మ‌తాబెన‌ర్జీ, కేజ్రీవాల్ త‌దిత‌రుల పార్టీలు మ‌ద్ద‌తుగా నిలిచాయి. వీళ్లంతా ఎన్డీఏకి వ్య‌తిరేకంగా పోరాడుతున్న నాయ‌కులే. ఈ నేప‌థ్యంలో ఇవాళ్టి మీడియా స‌మావేశంలో ధ‌ర్నాకు కాంగ్రెస్ హాజ‌రు కాక‌పోవ‌డం, ఇండియా కూట‌మిలోని పార్టీల నేత‌లు పాల్గొనడాన్ని ఎలా చూడాల‌నే జ‌ర్న‌లిస్టుల ప్ర‌శ్న‌కు జ‌గ‌న్ కీల‌క స‌మాధానం ఇచ్చారు.

కాంగ్రెస్‌ను కూడా ఆహ్వానించామ‌ని, అయితే రాలేద‌న్నారు. ఏపీలో చంద్ర‌బాబుకు అనుకూలంగా రాహుల్‌గాంధీ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించ‌డం గ‌మ‌నార్హం. ఇదే సంద‌ర్భంలో త‌మ‌కు అండ‌గా నిలిచిన ఇండియా కూట‌మిలోని నేత‌ల‌తో క‌లిసి భ‌విష్య‌త్‌లో పోరాడుతాన‌ని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు. ఇంత‌కాలం బీజేపీ అనుకూల ముద్ర వైసీపీపై వుంది. ఇక‌పై అలాంటి రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఉండ‌క‌పోవ‌చ్చు.

కాలానుగుణంగా, ప‌రిస్థితుల‌కు అనుగుణంగా వ్య‌వ‌హ‌రించాల‌నే ఆలోచ‌న జ‌గ‌న్‌లో రావ‌డంపై వైసీపీ శ్రేణులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నాయి.

37 Replies to “హ‌మ్మ‌య్య‌… జ‌గ‌న్ మొండిత‌నం వీడుతోంది!”

  1. అంటే కాంగ్రెస్ కలిసి రాకపోతే.. జగన్ రెడ్డన్న మూడో కూటమి పెడతాడా..?

    ఈ మూడు లెక్క ఎందుకో తేడా కొడుతోంది శీనా…

    పవన్ కళ్యాణ్ ని మూడు పెళ్లిళ్లు అంటూ వెటకారం చేసి చేసి.. చివరికి జగన్ రెడ్డి పార్టీ వెటకారం అయిపొయింది..

    మూడు రాజధానులు అని చెప్పి… ఏ ప్రాంతానికి అక్కరలేకుండా పోయాడు..

    ఇప్పుడు మొండితనం వీడి.. మూడో కూటమి పెడితే.. మొత్తానికి మాడు పగిలిపోతుందేమో.. శీనా..

      1. ఆయన టీడీపీ పార్టీ కు నిజమైన వాలంటీర్ మన లాగ Paytm batch కాదులే బ్రో

      2. నా శాలరీ మీద ఏడవటం మానేసి.. నీ శాలరీ పెంచుతారేమో కనుక్కో.. కామెంట్స్ కి 5 రూపాయలు ఇస్తున్నారా..? అధికారం పోయాక ఇంకా తగ్గించేసినట్టున్నారు..

        నువ్వు రెడ్డి వైతే.. పెంచుతారు.. లేకపోతే.. కూలి చేసుకుని బతకాల్సిందీ..

      3. mohan Krishna , Ane neeli lk June 4th tarvata online lo vunda galva Ani adigadu . Nenu yes ani cheppa.

        Alage cbn , Pawan annadu ap lo vundaru Ani.

        Chusthe shekka jagan ye ap lo ledu ,

        Neeli lk mohan Krishna site lo

  2. ప్ర‌ధాని మోదీతో పాటు కేంద్ర పెద్ద‌ల‌తో సాన్నిహిత్యం వ‌ల్ల ఇత‌ర పార్టీల‌కు వైసీపీ చేరువ కాలేక‌పోయింది.

    గత 5 Years గా YCP&BJP ది రహస్య స్నేహం అని ఒప్పుకున్నావ్ సంతోషం…TDP ఏది చెసినా ప్రజలకి చెప్పి డైరెక్ట్ గా చేసింది…మీరు మల్లి విశ్వసనీయతా.. మడమతిప్పడు…మాటతప్పడు లాంటి సిగ్గు వదిలేసిన మాటలు ఇంకోసారి చెప్పకండి రా నీలి సన్నాసులు

  3. ముక్కు దొర తో కలిసి ఎన్డీఏ, కాంగ్రెస్ కూటమి కి పోటీగా కొత్త కూటమి పెట్టాలి, ప్యాలస్ పులకేశి.

    దానిపేరు గం*జాయి మ*ద్యం పార్టీ అని పేరు పెట్టాలి.

  4. Much needed welcome change to survive in Politics , For Example Babu can tie up with congress for one election , he can desert bjp with ease and again he can tie up with no hesitation the same bjp.

  5. మోడీ రానివ్వట్లేదు, అలాగని రాహుల్ తో కలవలేడు. INDI కూటమిలో లీడింగ్ పార్టీ ఐన కాంగ్రెస్ తో లేకుండా ఎలా పనిచేస్తాడు మన అన్నియ్య ?

  6. సోనియాను ఎదిరించిన వీరుడు సూరుడు కాంగ్రెస్ గూటికి పోక తప్పదు..అన్నయ్య ఆస్తులు ఉన్నవి తెలంగాణ, కర్ణాటక లో కాబట్టి

    1. అన్నియ్యవి అన్నీ ఉత్తరకుమార ప్రగల్భాలే . మోడీ, షా లను చూస్తే క్రింద, మీద తడిసిపోతుంది.

  7. తాజ్ డీల్ కోసం సుందరిని పంపించడం….బాగా పని చేస్తుంది.

    రావుల్ మొన్న కూడా బాబుని కలవరిస్తున్నాడు…ప్రత్యేక హోదా ఇస్తా రా బాబు అని.

    లుకలుకల కూటములతో రావుల్ ని ఎవరు నమ్మలేని పరిస్థితి. అయినా కూడా అహంతో ముందుకి వెళ్తే రావుల్ ఏమి సాధించలేడు.

    చూద్దాం 24-29 మోడీకి, రావుల్ కి పెద్ద పరీక్ష…ముందుంది…..అసలు పండుగ.

    1. వినాశం గాడి కి, రోజు ప్రేమగా వేడి వేడి హెరిటేజ్ పాల గ్లాసు తాగించేది ,

      మాడా ప్యాలస్ పులకేశి నే అని గుసగుసలు.

      అన్న తమ్ముక్కు అంటే అల వుండాలి

  8. ఇలా పొగిడే అన్నయ్యని మొన్న ఎన్నికల్లో ముంచేశారు.

    సంబంధం లేకుండా కాంగ్రెసుకి, బాబుకి ముడి పెట్టడం.. ప్రతి సారి ఇలాగే అసెంబ్లీకి రాకుండా media meetings పెడతాను అని చెప్పటం..

    ఇవన్నీ తన అహాన్ని తగ్గిస్తాయేమో కానీ, జనాల్లో మాత్రం పలచన అయిపోతాము.

Comments are closed.