ఎన్నికలకు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమర శంఖాన్ని పూరించారు. సిద్ధం అనే నినాదంతో వైసీపీ సమరోత్సాహాన్ని ప్రదర్శిస్తోంది. ఇటీవల ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మూడు సిద్ధం సభలు నిర్వహించింది. ఒకదానికి మించి మరొక సభలు సక్సెస్ అయ్యాయి. ఈ రోజు బాపట్ల జిల్లాలోని మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభ సూపర్ సక్సెస్ అయింది. లక్షలాధి మంది వైసీపీ కార్యకర్తల మధ్యలో వైఎస్ జగన్ ప్రసంగం వైసీపీ శ్రేణుల్లో ప్రత్యర్థులను మట్టి కరిపించాలన్న పట్టుదల పెంచింది.
జగన్ మాట్లాడిన ప్రతి మాటకు ప్రత్యుర్ధులకు వెన్నులో వణుకు పుట్టించే లాగా ఉన్నాయి. చంద్రబాబుతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై కూడా ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్లు వేశారు. చంద్రబాబు కూటమిలో మూడు పార్టీలతో పాటు జేబులో మరో జాతీయ పార్టీ ఉందని. వీరంతా జగన్ ఓడించడానికి చూస్తున్నారని.. తాను మాత్రం పేదలను గెలిపించడానికి ప్రయత్నిస్తునన్నారు. పార్టీల పొత్తులతో బాబు ఉంటే.. ప్రజల బలం తనకు ఉందన్నారు.
చంద్రబాబుకు ఇతర పార్టీల్లో స్టార్లు క్యాంపెయినర్లు, అబద్ధాలకు రంగులు పూసే ఎల్లో మీడియా ఉంటే తనకు మాత్రం ప్రజల్లే స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్నారనన్నారు. జనసేన పవన్ కళ్యాణ్ పేరు కూడా ఎత్తకుండా ఆయనపై కూడా జగన్ విమర్శలు గుప్పించారు. ప్యాకేజీలు ఇచ్చి కొనుకున్న ప్యాకేజీ స్టార్ తన పార్టీ వారి కోసం సీటు కావాలని అడగడు. చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటాడు. సైకిల్ తోయమంటే తోస్తాడు. కావాలంటే తాను తాగే టీ గ్లాసు కూడా బాబుకే ఇచ్చేస్తాడంటూ సెటైర్లు వేశారు.
టీడీపీ మేనిఫెస్టోపై కూడా జగన్ విమర్శలు కురిపించారు. టీడీపీ మేనిఫెస్టోను కిచిడీతో పొల్చాడు. తెలంగాణ, కర్ణాటక ఎన్నికల వాగ్దానాలను చంద్రబాబు కాపీ కొట్టి ప్రజలను నమ్మించాలని చూస్తున్నారని.. 2014లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు మేనిఫెస్టో తయారు చేస్తున్నారంటూ విమర్శించారు.
వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో గురించి మాట్లాడుతూ.. తర్వలో మేనిఫెస్టో విడుదల చేస్తామని.. అందులో చేయగలిగింది, చేసేది మాత్రమే చెబుతామని.. జగన్ మాట ఇచ్చాడంటే తగ్గేదే లేదని.. పేదరికం వల్ల ఎదగలేకపోయామనే పరిస్థితి ఇక ఉండకూడదని.. లంచాలు, వివక్ష లేని వ్యవస్థ ఏర్పడాలనేదే తన కల, లక్ష్యం అన్నారు. ఈ సభ సక్సెస్ అవ్వడంతో వైసీపీ శ్రేణులు ఎన్నికల సమరానికి రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతున్నాయి. ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలన్న ఆశయాన్ని బలోపేతం చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు.