టిల్లు స్క్యేర్..ఇంకా వుంది

చిరకాలంగా షూటింగ్ లో వున్న సినిమాగా రికార్డు సృష్టిస్తోంది టిల్లు స్క్వేర్. బ్లాక్ బస్టర్ అయిన డిజె టిల్లుకు రెండో భాగంగా మొదలైన దగ్గర నుంచి స్క్రిప్ట్ వర్క్ మీదే ఎక్కువ కాలం వుంది.…

చిరకాలంగా షూటింగ్ లో వున్న సినిమాగా రికార్డు సృష్టిస్తోంది టిల్లు స్క్వేర్. బ్లాక్ బస్టర్ అయిన డిజె టిల్లుకు రెండో భాగంగా మొదలైన దగ్గర నుంచి స్క్రిప్ట్ వర్క్ మీదే ఎక్కువ కాలం వుంది. కాస్టింగ్ కూడా కాస్త ఆలస్యమైంది ఆఖరికి షూట్ మొదలైనా ఇంకా జరుగుతూనే వుంది. ఈ నెలాఖరుకు మంచి విడుదల డేట్ ఫిక్స్ చేసుకుని వుంది.

ఇప్పటికి ఒకటి రెండు సార్లు డేట్ లు అనుకున్నా రాలేదు. ఈ సారి అలా కాదు కచ్చితంగా రావాల్సి వుంటుంది. ఎందుకంటే చాలా మంది డేట్ మాత్రమే కాదు. సరైన సినిమా పడక జనం మొహం వాచి వున్నారు. పైగా టిల్లు స్క్వేర్ కు భయంకరమైన బజ్ వుంది.

ఆ బజ్ కారణంగానే మంచి మార్కెట్ కూడా రెడీ వుంది. నైజాంలో ఒకప్పుడు ఏడు కోట్ల రేటు చెప్పారని వార్తలు వచ్చి, అమ్మో అన్నారు. ఇప్పుడు పది కోట్లు చెబుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాంటి క్రేజ్ వుంది. కానీ సినిమా ప్రొడక్షన్ మాత్రం పూర్తి కావడం లేదు.

ఇప్పుడు ఫైనల్ షెడ్యూలు కాకినాడలో ప్లాన్ చేసారు. దుబాయ్ లో అనుకున్న క్లయిమాక్స్ కు మ్యాచింగ్ సీన్లు లేదా క్లయిమాక్స్ నో కాకినాడ పోర్టులో ప్లాన్ చేసారు. ఈ నెల 16 లేదా 18 నాటికి అది పూర్తవుతుంది. అంటే అప్పటికి విడుదల డేట్ మరో పది రోజులు మాత్రం వుంటుంది. సినిమా అంతా రెడీగా వుందని తెలుస్తోంది. ఈ ఫుటేజ్ జొడించి విడుదల చేయడమే.