మహారాణిగా మారిన హీరోయిన్

“ఈ కథ మగవాడిది, మగవాడి ఉనికిని నిలబెట్టిన శ్వాగణిక వంశానిది..” అంటూ శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్ రీసెంట్ గా పాపులర్ అయింది. శ్వాగ్ సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ లో భాగంగా విడుదల చేసిన…

“ఈ కథ మగవాడిది, మగవాడి ఉనికిని నిలబెట్టిన శ్వాగణిక వంశానిది..” అంటూ శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్ రీసెంట్ గా పాపులర్ అయింది. శ్వాగ్ సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ లో భాగంగా విడుదల చేసిన ఆ వీడియో వైరల్ అయింది. ఇప్పుడు దీనికి కౌంటర్ వచ్చింది.

శ్వాగ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రీతూ వర్మ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు ఈరోజు. ఈ సందర్భంగా మరో వీడియో విడుదల చేశారు. శ్వాగణిక వంశానికి చెందిన మగవాళ్లను అపహాస్యం చేస్తూ మహారాణి గెటప్ లో రీతూ వర్మ చెప్పిన డైలాగ్స్ తో వీడియో వదిలారు.

ఈ సినిమాలో రాణి రుక్మిణీ దేవిగా రీతూవర్మను పరిచయం చేశారు మేకర్స్. ఇలా ఈ సినిమాకు సంబంధించి హీరోహీరోయిన్లు ఫస్ట్ లుక్స్, పాత్రల్ని డిఫరెంట్ గా పరిచయం చేసి ప్రేక్షకుల్ని ఆకర్షించడంలో సక్సెస్ అయ్యాడు దర్శకుడు హసిత్ గోలి.

రాజరాజ చోర సినిమా తర్వాత హసిత్ గోలి నుంచి వస్తున్న మూవీ ఇదే. ఈసారి కూడా శ్రీవిష్ణునే హీరోగా సెలక్ట్ చేసుకున్న ఈ దర్శకుడు, మరో హిలేరియస్ సబ్జెక్ట్ తో రాబోతున్నాడని ఈ వీడియోలు చూస్తేనే అర్థమౌతుంది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇతర కీలక పాత్రల్ని త్వరలోనే వెల్లడిస్తారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.