వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దెబ్బకు భయపడే జనసేనాని పవన్‌కల్యాణ్‌కు తరచూ జ్వరం వస్తోందా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. ఈ ఎన్నికలు పవన్‌కల్యాణ్ రాజకీయ జీవితానికి సవాల్ కావడంతో, ఏమవుతుందో అనే మానసిక ఆందోళన ఆయన్ను అనారోగ్యం పాలు చేస్తోందని మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా పిఠాపురంలో గెలుపు ఆందోళన పవన్‌ను స్థిమితంగా ఉంచడం లేదని ఆయన వెంట వున్న వాళ్లు సైతం చెబుతున్నారు.
ఇటీవల పిఠాపురంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం పవన్ వెళ్లారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం పేరు చెబితే చాలు… ఒళ్లంతా పదుర్లు వస్తున్నాయని పవన్ సన్నిహితులు వాపోతున్నారు. తనను ఓడించడానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పద్మ వ్యూహాన్ని రచిస్తున్నారని, అలాగే టీడీపీ ఇన్‌చార్జ్ వర్మ మనస్ఫూర్తిగా చేయరని స్థానిక జనసేన నాయకులు చెబుతుండడంతో ఆయన భయపడుతున్నారు.
దీంతో గెలుపు భయం… పవన్‌ను తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తోంది. మరీ ముఖ్యంగా పిఠాపురంలో వుంటే, ఆయన్ను రకరకాల ఆలోచనలు, భయాలు వెంటాడుతూ, తీవ్ర అస్వస్థతకు గురి చేస్తున్నాయి. దీనికి మానసిక వైద్యుల వద్ద కౌన్సెలింగ్ తీసుకోవడం ఒక్కటే మార్గం. పిఠాపురంలో స్థిరంగా నాలుగు రోజులు వుండలేకపోయారంటే, ఆయన ఎంతగా భయపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
భయం పోతే ఆయన ఆరోగ్యంగా కనిపిస్తున్నారు. పిఠాపురం, జగన్, వర్మ గుర్తు కొస్తే చాలు… మనసంతా ఏదోలా అయిపోతోందనే చర్చకు తెరలేచింది. సహజంగా విద్యార్థుల్లో పరీక్షల భయం వుంటుంది. బాగా చదివే వాళ్లలో కూడా ఏమవుతుందో అనే ఆందోళన వెంటాడుతుంటోంది. అలాంటి భయమే పవన్‌ను మనశ్శాంతిగా వుండనివ్వడం లేదు.
ఎక్కడికెళ్లినా పిఠాపురం ఆలోచనలే వెంటాడుతుండడంతో జ్వరం బారిన పడుతున్నారు. తెనాలిలో బహిరంగ సభకు హాజరు కావాలని అనుకుని, చివరి నిమిషంలో అనారోగ్యం బారిన పడ్డారు. ఆ తర్వాత 7వ తేదీ నుంచి వరుసగా మూడు రోజుల పాటు షెడ్యూల్ ప్రకటించారు. అనకాపల్లి బహిరంగ సభలో పాల్గొన్న పవన్, ఆ మరుసటి రోజు యలమంచిలి సభను జ్వరం కారణంతో రద్దు చేసుకోవడం గమనార్హం. అయితే యలమంచిలి సభను రద్దు చేసుకున్నారని ప్రకటించడానికి జనసేన సిగ్గుపడింది.
ఎందుకంటే పవన్‌కల్యాణ్ సభలంటే…. ఓయబ్బా జరిగినప్పుడు చూద్దాంలే అనే అపనమ్మకం జనంలో ఏర్పడింది. ఇందుకు బలం కలిగించేలా పవన్ తీరు వుంది. అయితే పవన్ అనారోగ్యానికి అసలు కారణం… కేవలం ఆయన మానసిక స్థితి బాగా లేకపోవడమే అని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికైనా పవన్ సిగ్గు పడకుండా, మానసిక వైద్యుల వద్ద ట్రీట్మెంట్ తీసుకోకపోతే, చివరికి ఏమవుతారో ఆయనకే తెలియదు. పిఠాపురంలో గెలుస్తాననే ధీమాతో వుంటేనే, రానున్న రోజుల్లో పవన్ విస్తృతంగా ప్రచారం చేసే అవకాశం వుంది.
లేదంటే ఇలా ప్రతిరోజూ అనారోగ్యం పేరుతో సభలకు గైర్హాజరయ్యే పరిస్థితులే ఎదురవుతాయి. మొట్టమొదటగా తనను జగన్ ఓడిస్తారనే ఫోబియా నుంచి పవన్ బయట పడాల్సిన అవసరం ఎంతైనా వుంది. పవన్ అసలు సమస్య మానసిక రుగ్మతే. ఒకవైపు తక్కువ సీట్లు ఇచ్చి చంద్రబాబు మోసగించారని, దీంతో వెన్నంటి వుండే వాళ్లంతా దూరమవుతున్నారనే ఆవేదన కూడా ఆయన బ్యాలెన్స్ తప్పడానికి కారణం. ఇలా అన్ని వైపుల నుంచి సమస్యలు చుట్టుముడుతుంటే, మానసికంగా ఎదుర్కోలేకపోతున్నారు. ఇప్పుడాయనకు మానసిక ధైర్యం అవసరం. పవన్ రోగానికి మందు వేస్తే తప్ప, ఆయన మామూలు మనిషి కారని మానసిక వైద్యులు చెబుతున్న మాట.