నిజమే. జగన్ చరిత్ర సృష్టించారు. ముఖ్యమంత్రిగా 151 సీట్లతో అధికారాన్ని సాధించడం ఒక చరిత్ర అయితే మూడున్నరేళ్ళ పాలన మరో చరిత్ర. ఇంకో వైపు చూసుకుంటే జగన్ పాలనలో విప్లవాత్మకమైన నిర్ణయాలు చాలా ఉన్నాయి. కొన్ని సంస్కరణలు ఉన్నాయి. వాటి వల్ల వచ్చే ఫలితాలకు కొంత టైం పడుతుంది. విభజన ఆంధ్ర ప్రదేశ్ లో గతానికి భిన్నంగా కొత్త ఒరవడితో జగన్ పాలన చేస్తున్నారు. రొటీన్ కి భిన్నంగా ఆయన శైలి ఉంటుంది. ప్రతీ రోజూ ప్రతీ శాఖ మీద సమీక్షలు నిర్వహించడం బహుశా ఏ ముఖ్యమంత్రీ ఇప్పటిదాకా చేయనిది. ఇది ఒక చరిత్ర.
అలాగే గ్రామ స్వరాజ్యం అంటూ మాటలకు మాత్రమే పరిమితం అయిన దాన్ని ఒక ప్రయోగంగా సచివాలయాల వ్యవస్థ ద్వారా తీసుకురావడం మరో చరిత్ర. అక్కడికే మొత్తం పాలనను తెచ్చి ప్రజల వద్దకు పరిపాలన అన్న దాన్ని నిజం చేసి చూపించడం చరిత్ర.
ఈ దేశానికి స్వాతంత్రం లభించి ఏడున్నర దశాబ్దాల కాలం అయింది. తొలి ప్రభుత్వాల నుంచి తీసుకుంటే ఇప్పటికి కూడా అంతా కూడూ గూడూ అని చెబుతునే వచ్చారు. కానీ తమ పాలనలో వాటి కోసం ఎంత వెచ్చించారు అని ఆలోచిస్తే చాలా పరిమితం అనే చెప్పాలి.
అదే జగన్ సీఎం అయ్యాక పూర్తి సంతృప్తి స్థాయిలో టోటల్ గా ముప్పయి లక్షల మందికి ఇళ్ళ నిర్మాణం చేపట్టడం అన్నది నిజమైన చరిత్ర. ఇది సువర్ణ అక్షరాలతో లిఖించతగిన విషయం. ఏపీ జనాభా అయిదు కోట్లు అనుకుంటే అందులో ఇప్పటిదాక ఇళ్ళు ఉన్న కుటుంబాలు మూడు కోట్లు అని లెక్క వేసుకుంటే ఆ మిగిలిన కుటుంబాలకు ఇళ్ళను ఇవ్వడం ద్వారా ఈ రోజుకు ఇళ్ళు లేని పేద ఏపీలో లేడు అని జగన్ గట్టిగానే చాటి చెప్పారు. జగనన్న గృహ కాలనీల పేరిట ఆయన యజ్ఞమే చేపట్టారు.
ముప్పయి లక్షల ఇళ్ళు అంటే కుటుంబానికి అయిదుగురు సభ్యులు అని లెక్క వేసుకున్నా కోటిన్నర నుంచి రెండు కోట్ల మందికి శాశ్వత ఆవాసం కల్పించారు. ఇది ఈ దేశానికి స్వాతంత్రం లభించాక ఒక పరిపాలకుడు తీసుకున్న అతి గొప్ప నిర్ణయం అని చెప్పాలి. దీని మీద రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ జగన్ ముఖ్యమంత్రిగా ఇన్ని లక్షల మందిని ఇళ్ళను ఇవ్వడం ఈ దేశంలో ఇప్పటిదాకా ఎక్కడా ఏ రాష్ట్రంలో జరగలేదు.
ఇది చరిత్ర చెప్పుకునే విషయం. ఇది ఒక రికార్డు అని కొనియాడారు. రాబోయే రోజులలో ఏ ప్రభుత్వం కూడా ఈ నంబర్ ని దాటి వెళ్తుందని కూడా ఎవరూ అనుకోవడంలేదు. ఆ గ్రేట్ నెస్ అంతా జగన్ దే అంటున్నారు. అందుకే జగన్ ఒక చరిత్ర. ఆయన నిర్ణయాలు కూడా చరిత్ర. ఇది ఆయన్ని విమర్శించే వారు కూడా మనసు లోపల అయినా అంగీకరించే పరమ సత్యం.