అమ్మ అనే పిలుపుకంటే మధురమైంది లేదు. అమ్మ ప్రేమ కంటే మరేది గొప్పది కాదు. అందుకే అమ్మను దైవంతో సమానంగా భావిస్తారు. దేవుళ్ల కంటే అమ్మకే మొదటి స్థానం.
మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవోభవ అంటారు. తల్లి గొప్పతనంపై గొప్ప గొప్ప కవిత్వం, పాటలు వచ్చాయి. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
ఈ సందర్భంగా అమ్మ ప్రేమ గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తల్లి గురించి ప్రశంసనీయమైన ట్వీట్ చేశారు.
‘తల్లి ప్రేమ శాశ్వతమైనది మరియు దైవసంబంధమైంది. ఏపీలోని తల్లులందరి సాధికారత కోసం కృషి చేయడం కంటే నాకు ఈ జీవితాన్ని బహుమతిగా ఇచ్చిన మా అమ్మకు గొప్ప బహుమతి మరొకటి ఉండదు’ అంటూ ట్విట్టర్ వేదికగా అమ్మలందరికీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలపడం విశేషం.
తల్లులందరి సాధికారత కోసం కృషి చేసే అవకాశం ఇచ్చిన మాతృమూర్తి విజయమ్మకు జగన్ శుభాకాంక్షలు చెప్పారు. సేవ చేసేందుకు జన్మనిచ్చిన అమ్మను ఆయన ప్రత్యేకంగా గుర్తు చేసుకుని, ఆ విషయాన్ని ప్రస్తావించడం విశేషం. జగన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.