జనసేన అసలు పార్టీనే కాదు…

జనసేన గురించి ఇపుడు డిస్కషన్ సాగుతోంది. ఆ పార్టీ తరఫున కొందరు విశాఖ విమానాశ్రయంలో చేసిన అల్లరి గురించి కూడా వైసీపీలో హాట్ హాట్ గా డిస్కషన్ సాగుతోంది. టీడీపీతో పాటు జనసేన కలసి…

జనసేన గురించి ఇపుడు డిస్కషన్ సాగుతోంది. ఆ పార్టీ తరఫున కొందరు విశాఖ విమానాశ్రయంలో చేసిన అల్లరి గురించి కూడా వైసీపీలో హాట్ హాట్ గా డిస్కషన్ సాగుతోంది. టీడీపీతో పాటు జనసేన కలసి వైసీపీ మీదకు ప్రతీ విషయంలోనూ చేస్తున్న రాజకీయ రాద్ధాంతం మీద కూడా వైసీపీ నేతలు  ఫైర్ అవుతున్నారు.

జనసేన మీద వైసీపీ నేతలు విమర్శలు చేయడం మమూలే. దానికి అటు నుంచి కూడా కామెంట్స్ వచ్చి పడుతూంటాయి. కానీ పార్టీ పెట్టి ఎనిమిన్నరేళ్ళ కాలంలో ఫస్ట్ టైం జనసేన మీద ఒక పెద్ద విమర్శ చేశారు సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ. జనసేన గురించి అసలు ఎందుకు ఇన్ని డిస్కషన్స్ అనుకున్నారో ఏమో అదసలు పార్టీయే కాదు అని ఒక్క మాటలో తేల్చేశారు.

ఒక వ్యక్తి తానుగా పెట్టుకున్న ఒక సంస్థ లాంటిది మాత్రమే అని ఆ పార్టీ గురించి చెప్పేశారు. నిజానికి జనసేనకు విధి విధానాలు లేవు రాజకీయ పార్టీగా ఒక రూపం లేదని వైసీపీ వారు చాలా మంది అన్నారు. కానీ ఇలా సూటిగా సుత్తి లేకుండా అదసలు పార్టీయే కాదు అని బొత్స అంతటి సీనియర్ పొలిటీషియన్ చెప్పాక దాని మీద కూడా డిస్కషన్ పెట్టాల్సిందేనేమో

విశాఖ రాజధాని చేస్తామంటే టీడీపీకి కక్ష ఉంది. జనసేనకు కూడా అంతే కక్ష కోపం ఎందుకు అని పవన్ని బొత్స డైరెక్ట్ అటాక్ చేశారు. చంద్రబాబు పవన్ ఈ ఇద్దరూ కలసి ఉత్తరాంధ్రా ప్రజల మనోభావాలతో ఆడుకుందామనుకుంటే చెల్లదంటే చెల్లదని బొత్స గట్టిగానే చెప్పారు. ఉత్తరాంధ్రా ప్రజల రాజకీయ ఆకాంక్ష ఏ స్థాయిలో ఉందో విశాఖ గర్జనతో రుజువు అయిందని ఆయన చెప్పుకొచ్చారు.