అసలు వైఎస్ జగన్‌ను సీఎంగా గుర్తించేదే లేదని చెప్పిన వాళ్లు…. నేడు గుడ్‌మార్నింగ్ అనడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జగన్‌కు వ్యతిరేకంగా అంటున్నప్పటికీ, ఆయన ఉనికిని గుర్తించాల్సిన అనివార్యమైన పరిస్థితి జనసేనకు ఎదురైంది.
ఈ నెల 15,16. 17 తేదీల్లో జనసేన సోషల్ మీడియా వేదికగా సరికొత్త పోరాటాన్ని స్టార్ట్ చేయనుంది. ఈ మేరకు వివరాలను జనసేన ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ‘హ్యాష్‌గుడ్‌మార్నింగ్ సీఎంసార్’ అంటూ జనసేన క్యాంపెయిన్‌ను చేపట్టనుంది. ఈ హ్యాష్‌ట్యాగ్‌తో ప్రజా సమస్య లను తీసుకుని ప్రజల్లోకి వెళ్లేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. ముఖ్యంగా రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై ఈ నూతన కార్యక్రమం ద్వారా ఆందోళనలకు జనసేన శ్రీకారం చుట్టనుంది. ఈ కార్యక్రమంలో జనసేనాని పవన్‌కల్యాణ్ స్వయంగా పాల్గొననున్నారు.
తెనాలిలో నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ‘హ్యాష్‌గుడ్‌మార్నింగ్ సీఎంసార్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో డిజిటల్ క్యాంపెయిన్‌కు రూపకల్పన చేశామన్నారు. రాష్ట్రంలోని రహదారుల దుస్థితిపై ఈ నెల 15,16,17 తేదీల్లో క్యాంపెయిన్ చేపట్టనున్నట్టు ఆయన చెప్పారు.
రాష్ట్రంలో రహదారులకు కనీస మరమ్మతులు చేపట్టలేన్నారు. గాఢ నిద్రలో ఉన్న ముఖ్యమంత్రిని నిద్ర లేపడానికే ‘హ్యాష్‌గుడ్ మార్నింగ్ సీఎం సార్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రోడ్ల దుస్థితిపై ఫొటోలను, వీడియోలను అప్ లోడ్ చేస్తామన్నారు.
ప్రభుత్వం దృష్టికి రోడ్ల దుస్థితిని తీసుకొచ్చేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. హ్యాష్‌ట్యాగ్‌తో రోడ్లు ఎంత సుందరంగా ఉన్నాయో ప్రజలకు చూపిస్తామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రోడ్లను వేయాలని కోరారు.