జనసేన నుంచి దమ్మున్న కామెంట్

జనసేన నాయకులు మాట్లాడితే ఎపుడూ వైసీపీ మీదనే టార్గెట్ చేస్తారు. ఏపీలో వైసీపీ వచ్చిన తరువాతనే అప్పులు సమస్యలు అన్నీ ఉన్నట్లుగా విమర్శలు చేస్తారు. నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలంటే తెలుగుదేశం పాలనలోని లోపాలను కూడా…

జనసేన నాయకులు మాట్లాడితే ఎపుడూ వైసీపీ మీదనే టార్గెట్ చేస్తారు. ఏపీలో వైసీపీ వచ్చిన తరువాతనే అప్పులు సమస్యలు అన్నీ ఉన్నట్లుగా విమర్శలు చేస్తారు. నిర్మాణాత్మకమైన విమర్శలు చేయాలంటే తెలుగుదేశం పాలనలోని లోపాలను కూడా చూసి మాట్లాడాలి.

ఈ విషయంలో ఆ పార్టీ సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ స్టైల్ వేరు. ఆయన తెలుగుదేశం పార్టీని తూర్పారా పట్టడంలో చాలా ముందుంటారు. జనసేనకు వైసీపీ తెలుగుదేశం పార్టీలు రెండూ ప్రత్యర్ధులే అన్నది బొలిశెట్టి వాదన. మూడవ పక్షంగా ఏపీ రాజకీయాల్లో ఉండేది తామే అన్నది ఆయన పొలిటికల్ ఫిలాసఫీ.

ఆయన లేటెస్ట్ గా నారా లోకేష్ పాదయాత్ర మీద చేసిన కామెంట్స్ హాట్ గానే ఉన్నాయి. లోకేష్ పాదయాత్ర చతికిలపడింది అని బొలిశెట్టి బుల్లెట్ లాంటి విమర్శ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ఎత్తుగడలకు కాలం చెల్లిందని బొలిశెట్టి మరో బాణం వేశారు

రాష్ట్రంలో ఎపుడూ ఏదో అలజడి సృష్టించడం, వివాదాలు రాజేయడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించడానికి అధికార వైసీపీ విపక్ష తెలుగుదేశం పార్టీలు రెండూ చూస్తున్నాయని ఆయన ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని రైతులు, మహిళలు, యువత, బడుగు బలహీన వర్గాలు అన్నీ కొత్త ప్రత్యామ్యాయం అయిన జనసేన వైపు ఆశగా చూస్తున్నాయని బొలిశెట్టి అంటున్నారు

జనసేన నుంచి లోకేష్ పాదయాత్ర మీద ఈ తరహ కామెంట్స్ రావడం ఆలోచించతగినదే. బాబు వ్యూహాలకు కాలం చెల్లిందని అనడమూ రాజకీయంగా విశేషంగా చూడాలి. బొలిశెట్టి తాజా వ్యాఖ్యలను చూస్తే దమ్మున్న కామెంట్స్ గానే భావిస్తున్నారు. ఇదే ఫోర్స్ తో జనసేన నేతలు డైనమైట్ల లాంటి డైలాగులను పేలిస్తే ఏపీ పాలిటిక్స్ లో వారికంటూ ఒక ప్లేస్ ఉంటుందన్నది అంతా అంటున్న మాట. జనసేన వ్యూహం మారిందా అన్న అనుమానాలు బొలిశెట్టి కామెంట్స్ ని చూస్తే కలుగుతున్నాయి.