చంద్రబాబు వలన… చంద్రబాబు చేత పుట్టిన పార్టీ… ?

చంద్రబాబు పుట్టి బుద్దెరిగి ఏ రాజకీయ పార్టీ ఏనాడూ పెట్టలేదు. ఇది చరిత్ర చెప్పిన నిజమే. ఇక ఆయన రాజకీయ అడుగులు చూస్తే తొలుత ఆయన కాంగ్రెస్ లో చేరారు. అలాగే టీడీపీలో చేరి…

చంద్రబాబు పుట్టి బుద్దెరిగి ఏ రాజకీయ పార్టీ ఏనాడూ పెట్టలేదు. ఇది చరిత్ర చెప్పిన నిజమే. ఇక ఆయన రాజకీయ అడుగులు చూస్తే తొలుత ఆయన కాంగ్రెస్ లో చేరారు. అలాగే టీడీపీలో చేరి మామ ఎన్టీయార్ పార్టీకి తానే ప్రెసిడెంట్ అయ్యారు. ఇదంతా అందరికీ తెలీసిందే. ఎవరైనా రాజకీయ ప్రత్యర్ధులు అయితే చంద్రబాబు విషయం వస్తే ఆయన సొంతంగా పార్టీ పెట్టాలి, ఎన్నికల్లో కొత్త గుర్తు పెట్టుకుని గెలవాలీ అని సవాల్ చేస్తారు.

అయితే చంద్రబాబు పార్టీ సొంతంగా పెట్టలేదు, కానీ ఆయన ఎవరి చేతనైనా పార్టీ పెట్టిస్తారు అని కూడా వైసీపీ లాంటి వారు విమర్శలు చేస్తారు. అలా చంద్రబాబు వలన చంద్రబాబు కోసం చంద్రబాబు చేత పుట్టిన పార్టీ ఏది అంటే జనసేన పార్టీనట. ఇది నిజంగా ఇప్పటిదాకా ఎవరూ వినని కనని సరికొత్త రాజకీయ సెటైర్ గానే చూడాలి.

పవన్ కళ్యాణ్ బాబుకు దత్తపుత్రుడు అని ఇప్పటిదాకా  విమర్శలు చేసేన‌ వైసీపీ నేతలు వెనకాల కధను కూడా ఇలా చెబుతున్నారు. మంత్రి గుడివాడ అమరనాధ్ అయితే పవన్ కళ్యాణ్ణి ఒక్క లెక్కన చెడుగుడు ఆడేశారు. జనసేన పార్టీ అన్నది  ఉన్నదే చంద్రబాబు కోసం అని కూడా చెప్పేశారు. కౌలు రైతుల గురించి కన్నీళ్ళు కారుస్తున్న పవన్ నాడు చంద్రబాబు ఏలుబడిలో ఎన్నో ఆత్మహత్యలు జరిగితే ఎందుకు మాట్లాడలేదు అని నిలదీశారు.

మొత్తానికి చూస్తే చంద్రబాబు అయిదేళ్ళు ఏలుబడిలో గమ్మున ఉన్న పవన్ ఇపుడు మాత్రం కౌలు రైతుల విషయంలో ఏదో అన్యాయం జరిగిపోతోందని రోడ్డు మీదకు వచ్చి నానాయాగీ చేయడం దారుణమని గుడివాడ అంటున్నారు. పవన్ కళ్యాణ్   మూడు నెలలుగా ఏపీలో చేస్తున్న టూర్లు అన్నీ కూడా అట్టర్ ఫ్లాప్ అనేశారు. ఇదంతా బాబు స్క్రిప్ట్ ప్రకారమే అని కూడా ఆరోపించారు.

ఇక ఏపీలో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకోని పార్టీలు ఏవీ లేవని అని అంటూ ఇది వరల్డ్ రికార్డ్ అన్నారు. తక్కువ టైమ్ లో ఎక్కువ పార్టీలతో పొత్తు పెట్టుకున్న పవన్ కంటే రాజకీయ ఘనాపాఠి ఎవరూ ఉండరేమో అని సెటైర్లు వేశారు. అక్రమంగా కేసులు పెడితే పదహారు నెలలు జైలులో ఉన్న జగన్ నేరగాడు ఎలా అవుతాడో పవనే చెప్పాలని గుడివాడ స్ట్రాంగ్ గానే నిలదీశారు. మొత్తానికి గుడివాడ చెడుగుడు కి జనసేనాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.