జ‌న‌సేన.. వారిద్ద‌రి ప‌రిస్థితీ వ‌ర్ణ‌నాతీతం!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు చేసిన‌ ల‌వ్ ప్ర‌పోజ‌ల్ ను దాదాపు ఒప్పేసుకున్నారు జ‌న‌సేన‌ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్. ఇప్ప‌టికే రెండు సార్లు మీడియా ముఖంగా కూడా క‌లుసుకున్నారు. ఇక‌పై ప‌బ్లిక్ గా చెట్టాప‌ట్టాల్…

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు చేసిన‌ ల‌వ్ ప్ర‌పోజ‌ల్ ను దాదాపు ఒప్పేసుకున్నారు జ‌న‌సేన‌ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్. ఇప్ప‌టికే రెండు సార్లు మీడియా ముఖంగా కూడా క‌లుసుకున్నారు. ఇక‌పై ప‌బ్లిక్ గా చెట్టాప‌ట్టాల్ వేసుకుని తిర‌గ‌బోతున్న‌ట్టు కూడా ప్ర‌క‌టించారు. ఇద్ద‌రూ క‌లిసి తిరిగితే వారికి ఎటువంటి స‌మ‌స్య లేదు. కానీ స‌మ‌స్య అంత ఇన్ని రోజులు పార్టీ అధికారంలోకి రాక‌పోయినా, రాద‌ని తెలిసినా ఏదో క‌నీసం ఒక రాజ‌కీయ పార్టీకి నాయ‌కులుగా ఉన్నామని ఖ‌ర్చు పెట్టిన జ‌న‌సేన నాయ‌కుల‌ది.

ముఖ్యంగా రాయ‌ల‌సీమ‌లోని ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా జ‌న‌సేనకు సంబంధించి ఇప్పుడు ఇద్ద‌రు నాయ‌కుల బాధ వ‌ర్ణ‌న తీరం. గ‌తంలో చిరంజీవి ప్ర‌జా రాజ్యం పెట్టిన‌ప్పుడు త‌మ కులం వాడ‌ని అందులోకి వెళ్లి పార్టీ కోసం వీళ్ల‌లో ఒక‌రు బాగా ఖ‌ర్చు పెట్టారు. తీరా చూస్తే అక్క‌డ పార్టీ క్లోజ్.. త‌ర్వాత అదే ఇంటి నుండి ఇంకో పార్టీ వ‌స్తే అన్న లాగా కాకుండా త‌మ్ముడు రాజ‌కీయం బాగుంటుందని వ‌చ్చి ఆయ‌న ఖర్చు పెట్టారు. త‌మ్ముడు అన్న‌లాగా కాకుండా రాజ‌కీయం కూడా వంతుల వారీగా చేస్తున్నా ఏదో పార్టీ అయితే ఉందిగా అనీ ఇన్నీ రోజులు రాజ‌కీయం చేశారు. తీరా ఎన్నిక‌లు సమీపిస్తుండంతో ప‌వ‌న్ -ప‌చ్చ పార్టీతో పొత్తు పెట్టుకొగానే ఆయ‌న‌ రాజ‌కీయ భ‌విష్య‌త్తు ప్రశ్నార్థ‌కం అయ్యింది.

ఇక రాయ‌ల‌సీమ‌లో గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచినే జ‌న‌సేన‌లోకి చేరి, ఆ పార్టీకి ముఖ్య‌నేత‌గా చ‌లామ‌ణి అయిన నేత మ‌రొక‌రు. ఆయ‌న రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత‌. గ‌తంలో తెలుగుదేశం పార్టీలో ప‌ని చేశారు, ఆ త‌ర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆ పార్టీల్లో త‌న‌కు గుర్తింపు వ‌చ్చే అవ‌కాశం లేద‌ని ఆయ‌న జ‌న‌సేన‌లోకి చేరారు. పోటీ కూడా చేశారు. డిపాజిట్ కూడా ద‌క్క‌లేదు కానీ జ‌న‌సేన‌లో రాష్ట్ర నేత‌గా చ‌లామ‌ణి కావ‌డానికి ఆయ‌న చాలా ఖ‌ర్చులు అయితే చేసుకోవాల్సి వ‌స్తోంది. లోక‌ల్ గా పార్టీ ఆఫీసుకు క‌ట్టే రెంటుతో మొద‌లుపెడితే, బోలెడంత మెయింటెయినెన్స్. త‌న కూతురు పెళ్లికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ను ఆహ్వానించుకుని భారీగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారాయ‌న‌. అయితే ప‌వ‌న్ త‌న పార్టీ ముఖ్య నేత‌కు ఆ మాత్రం కాల్షీట్లు కూడా కేటాయించ‌లేదు. ఏతావాతా జ‌న‌సేన రాష్ట్ర స్థాయి నేత‌గా ఆయ‌న బోలెడంత ఖ‌ర్చులు పెట్టుకుంటూ ఉన్నారు. మ‌రి ఇంత చేస్తుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన సీటు ద‌క్క‌డం అసాధ్యం అని స్ప‌ష్టం అవుతోంది. టీడీపీ, జ‌న‌సేన పొత్తు పెట్టుకుంటే ఆ సీటును ఎట్టి ప‌రిస్థితుల్లోనూ జ‌న‌సేన‌కు వ‌ద‌ల‌దు టీడీపీ!

ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక స‌భ‌లో మాట్లాడుతూ.. పొత్తు వెళ్ల‌క‌పోతే నేను వీర‌మ‌ర‌ణం పొందుతా.. కాబ‌ట్టి వ‌చ్చే ఎన్నిక‌ల‌కు పొత్తుతోనే వెళ్ల‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప‌వ‌న్ అలా ప్ర‌క‌టించాగానే ఈ నేత‌ల‌కు  భ‌యం ప‌ట్టుకుంది. పార్టీ కేంద్ర కమిటీలో ఉంటూ ప‌వ‌న్ కోసం ఇప్ప‌టికే భారీగా డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టిన ఇద్ద‌రు నాయ‌కులు వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ‌కు సీట్లు రావ‌నే క్లారిటీతో పార్టీ అఫీసులు కూడా మూసివేయాబోతున్న‌ట్లు తెలుస్తోంది. అనంత‌పురంలో ఈ ఇద్ద‌రి నాయకుల నియోజ‌క‌వ‌ర్గ‌ల్లో టీడీపీ అధినేత సామాజిక వ‌ర్గ నేత‌లో పొటీ ఉండ‌బోతున్నారు అందుకే దాదాపు త‌మ‌కు సీట్లు రావ‌ని ఒక‌ అవగాహ‌నకు వ‌చ్చారు.

పాపం గ‌తంలో ఈ ఇద్ద‌రి నాయ‌కుల్లో ఒక్క‌రు ప్ర‌జారాజ్యం త‌రుపున కూడా భారీగా ఖ‌ర్చు పెట్టి చేయి కాల్చుకున్న కులభిమానంతో ప‌వ‌న్ ద‌గ్గ‌రికి చేరి ఇప్పుడు ప‌వ‌న్ రాజ‌కీయ భేరంలో భాగంగా త‌ము బలి అయినందుకు తెగ బాధ‌ప‌డుతున్నారు. క‌నీసం ఉమ్మ‌డి అనంత‌లో క‌నీసం త‌మ ఇద్ద‌రికైనా పొత్తులో భాగంగా సీటు ఇవ్వ‌లాని భారీగానే లాబీయింగ్ చేసుకోవ‌చ్చు. ఈ లాబీయింగ్ కు ప‌వ‌న్ కంటే ముఖ్యంగా చంద్ర‌బాబును న‌మ్ముకుంటే ప‌ని అవుతుంద‌ని అటు నుండి మంతనాలు సాగిస్తున్నారు. కానీ చంద్ర‌బాబు త‌న సామాజిక వర్గ‌నికి ప్రాధాన్యత ఇవ్వ‌కుండా వీరికి ఎంత వ‌ర‌కు ఇస్తారో చూడాలి.