టీడీపీ కార్యకర్తలు, నాయకులకు జనసేన మహిళా ఎమ్మెల్యే నిద్ర కరవు చేశారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఆ ఘనత సాధించారు. తనకు టికెట్ ఇస్తే అడ్డుకున్న టీడీపీ నాయకులను ఆమె ప్రత్యేకంగా గుర్తు పెట్టుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఏం చేయాలో ముందే ఆమె ఆలోచించుకున్నట్టుగా, ప్రస్తుత చర్యలు తెలియజేస్తున్నాయి.
మరోవైపు ప్రభుత్వ కార్యాలయాలకు టీడీపీ కార్యకర్తలు, నాయకులు పసుపు బిళ్లలతో వెళితే చాలు సకల మర్యాదలతో పాటు పనులు కూడా చేసి పంపుతారని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మహా గొప్పగా ప్రకటించిన సంగతి తెలిసిందే. నెల్లిమర్లలో పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. తెలిసో, తెలియకో పసుపు బిళ్లలు వేసుకెళితే, అధికారుల నుంచి ఛీత్కారాలు, అమర్యాదలు, అవహేళనలు తప్పవనే భయం టీడీపీ నేతల్ని వెంటాడుతోంది.
తాను చెప్పినవి, అది కూడా చెప్పిన వారికే చేయాలని నియోజకవర్గంలోని అధికారులకు ఎమ్మెల్యే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు, జనసేన నాయకుల్నే ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించాలని అధికారులకు ఎమ్మెల్యే లోకం మాధవి ఆదేశాలు ఇచ్చారు. దీంతో తాము అధికారంలో ఉన్నామా? లేక ప్రతిపక్షంలో ఉన్నామా? అంటూ టీడీపీ నాయకులు లబోదిబోమంటున్నారు. అధికారంలోకి వచ్చాక కూడా ఇన్ని అవమానాలా? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే రానున్న ఐదేళ్లు ఎలా గడపాలని పెద్ద నాయకుల వద్ద స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ప్రస్తావించినట్టు తెలిసింది.
నెల్లిమర్లలో నెలలోపే టీడీపీ, జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి రావడంపై కూటమిలో ఆందోళన నెలకుంది. ఎమ్మెల్యే మాధవి తమను మనుషులుగా కూడా చూడడం లేదనేది టీడీపీ నేతల ఆవేదన. రానున్న రోజుల్లో వీరి గొడవ ఎంత వరకు వెళ్తుందో అని స్థానికులు చర్చించుకుంటున్నారు.
ఇందులో అంత బుర్ర పాడుచేస్కునేదేవుంది ..టీడీపీ వోళ్ళు జనసేన వోళ్ళు నరుక్కుని చచ్చిపోతే పోలా.
బోకు ఆంధ్రా పత్రిక కథలు ఇలాగే ఉంటాయి.. ఇది paytm పత్రిక 😡
నీకు కావలిసింది, నువ్వు కోరుకునేది ఇదే గా GA