జోలె ప‌ట్టిన ప‌వ‌న్ పార్టీ!

జ‌న‌సేన విరాళాల వేట మొద‌లు పెట్టింది. జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ అని గ‌తంలో ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి జ్ఞానోద‌యం తీసుకొచ్చిన‌ట్టుంది. రాజ‌కీయాల్లో డ‌బ్బు లేనిదే ఏమీ చేయ‌లేమ‌ని ఆయ‌న‌కు…

జ‌న‌సేన విరాళాల వేట మొద‌లు పెట్టింది. జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ అని గ‌తంలో ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు గ‌త ఎన్నిక‌ల్లో ఓట‌మి జ్ఞానోద‌యం తీసుకొచ్చిన‌ట్టుంది. రాజ‌కీయాల్లో డ‌బ్బు లేనిదే ఏమీ చేయ‌లేమ‌ని ఆయ‌న‌కు అనుభ‌వాలు గుణ‌పాఠాలు నేర్పాయి. ఈ ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న ప‌వ‌న్ …సీరియ‌స్‌గా పోటీ చేయాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో జ‌న‌సేన విరాళాల సేక‌ర‌ణ‌కు బ‌హిరంగంగా పిలుపునిచ్చింది. ఈ మేర‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆ పార్టీ విరాళాల క్యాంపెయిన్ మొద‌లు పెట్టింది.

“నా సేన కోసం నా వంతు” అనే నినాదంతో జ‌న‌సేను అభిమానించే ప్ర‌తి ఒక్క‌రూ త‌మ‌కు తోచినంత విరాళం ఇవ్వాల‌ని ఆ పార్టీ పిలుపునిచ్చింది. ప‌దేళ్ల జ‌న‌సేన పార్టీ టీడీపీ వేసే సీట్ల భిక్ష‌పై ఆధార‌ప‌డి పోటీ చేయ‌నుంది. టీడీపీ ప‌ల్ల‌కీ మోయ‌డానికి జ‌న‌సేన‌కు ముష్టి వేయ‌డానికి టీడీపీ క‌స‌ర‌త్తు చేస్తోంద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌న అజ్ఞానంతో చేజేతులా డిమాండ్ చేసే స్థాయి నుంచి యాచించే స్థాయికి దిగ‌జారార‌ని సొంత పార్టీ నేత‌లే విమ‌ర్శిస్తున్నారు. టీడీపీ ప్యాకేజీకి ఒప్పుకుని, ఆ పార్టీ ఇచ్చిన‌న్ని సీట్ల‌తో స‌రిపెట్టుకున్నార‌నే విమ‌ర్శ‌లు సోష‌ల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. అలాంట‌ప్పుడు మ‌ళ్లీ విరాళాలు సేక‌ర‌ణ ఎందుక‌నే నిల‌దీత ఎదుర‌వుతోంది. జ‌న‌సేన సీట్ల‌పై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తే మాత్రం.. ర‌చ్చ‌ర‌చ్చ త‌ప్ప‌ద‌నే హెచ్చ‌రిక‌లు వెలువ‌డుతున్నాయి.