NRI TDP USA-కో-ఆర్డినేటర్ గా ‘జయరాం కోమటి’ నియామకం!

ప్రవాసాంధ్రుల హర్షం!! Advertisement తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు NRI TDP USA కో-ఆర్డినేటర్ గా జయరాం కోమటి ని నియమిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్…

ప్రవాసాంధ్రుల హర్షం!!

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు NRI TDP USA కో-ఆర్డినేటర్ గా జయరాం కోమటి ని నియమిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. 

తనపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతని అప్పగించిన పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కు జయరాం కోమటి  ధన్యవాదాలు తెలిపారు. 

అమెరికాలో పార్టీని మరింత పటిష్ట పరచుతూ 2024 ఎన్నికలలో విజయమే లక్ష్యం గా పనిచేస్తానని జయరాం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం అభిమానులు జయరాం ని అభినందించారు.