జేసీ దివాక‌ర్‌రెడ్డి వ‌ర్సెస్ ఆదినారాయ‌ణ‌రెడ్డి

వైఎస్సార్ జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం ఎర్ర‌గుంట్ల మండ‌లంలోని ఆర్టీపీపీ నుంచి ప్లైయాష్ త‌ర‌లింపు విష‌య‌మై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి, తాడిప‌త్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కుడు జేసీ దివాక‌ర్‌రెడ్డి వ‌ర్గీయుల మ‌ధ్య గొడ‌వ…

వైఎస్సార్ జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గం ఎర్ర‌గుంట్ల మండ‌లంలోని ఆర్టీపీపీ నుంచి ప్లైయాష్ త‌ర‌లింపు విష‌య‌మై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయ‌ణ‌రెడ్డి, తాడిప‌త్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయ‌కుడు జేసీ దివాక‌ర్‌రెడ్డి వ‌ర్గీయుల మ‌ధ్య గొడ‌వ జ‌రుగుతోంది. ఈ గొడ‌వంతా ఆదాయం కోస‌మే అని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

ఇటీవ‌ల బీజేపీ ఎంపీ సీఎం ర‌మేశ్‌కు చెందిన రిత్విక్ సంస్థ ప‌నుల్ని ఆదినారాయ‌ణ‌రెడ్డి వ‌ర్గీయులు అడ్డుకున్న సంగ‌తి తెలిసిందే. సీఎం ర‌మేశ్ సంస్థ తాము డిమాండ్ చేసిన‌ట్టు కాంట్రాక్ట్ ప‌నులు ఇవ్వ‌లేద‌నే ఆగ్ర‌హంతో ఏకంగా జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే వ‌ర్గీయులు దాడికి తెగ‌బ‌డ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైన సంగ‌తి తెలిసిందే.

జేసీ దివాక‌ర్‌రెడ్డి, ఆదినారాయ‌ణ‌రెడ్డి … ఇద్ద‌రూ కూట‌మి నేతలే కావ‌డం విశేషం. జేసీ దివాక‌ర్‌రెడ్డి తాడిప‌త్రికి చెందిన టీడీపీ నాయ‌కుడు, ఆదినారాయ‌ణ‌రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే. వీళ్లిద్ద‌రి మ‌ధ్య ప్ల‌యాష్ త‌ర‌లింపున‌కు సంబంధించిన ఒప్పందంపై విభేదాలు త‌లెత్తిన‌ట్టు తెలిసింది.

జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోకి ఆర్టీపీపీ వ‌స్తుంది. దీంతో త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో ఏం జ‌రిగినా త‌మ క‌నుస‌న్న‌ల్లోనే అని ఆదినారాయ‌ణ‌రెడ్డి భావిస్తున్నార‌ని స‌మాచారం. తాడిప‌త్రి నియోజ‌క‌వ‌ర్గంలోని సిమెంట్ ప‌రిశ్ర‌మ‌ల‌కు ఆర్టీపీపీ నుంచి జేసీ దివాక‌ర్‌రెడ్డి వ‌ర్గీయుల వాహ‌నాలు ప్ల‌యాష్ త‌ర‌లిస్తున్నాయి. అయితే ఒప్పందం కుద‌ర‌క‌పోవ‌డంతో జేసీ దివాక‌ర్‌రెడ్డి వాహ‌నాల్ని ఆర్టీపీపీకి ఎట్టి ప‌రిస్థితుల్లో రానివ్వ‌కూడ‌ద‌ని ఆది వ‌ర్గీయులు పంతం ప‌ట్టారు.

ఇందులో భాగంగా ఈ రోజు జేసీ దివాక‌ర్‌రెడ్డి వాహ‌నాలు ఆర్టీపీపీకి వ‌స్తున్నాయ‌ని తెలిసి, ఆర్టీపీపీ స‌మీపంలోని క‌ల‌మ‌ల్ల వ‌ద్ద ఆదినారాయణ‌రెడ్డి వ‌ర్గీయులు భారీగా మోహ‌రించారు. వ‌స్తే దాడి చేయ‌డానికి ఆది వ‌ర్గీయులు సిద్ధ‌ప‌డ్డారు. ఈ విష‌యం తెలిసి ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా పోలీసు బ‌ల‌గాలు అక్క‌డికి చేరుకున్నాయి.

ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, సుమారు 50 మందికి పైగా యాష్ పాండు వద్ద మొహరించారు. ఇటీవ‌ల సీఎం ర‌మేశ్ రిత్విక్ కంపెనీ యంత్రాలు, ఉద్యోగుల‌పై ఆది వ‌ర్గీయుల దాడిని మ‌రిచిపోక‌నే, కూట‌మికే చెందిన జేసీ దివాక‌ర్‌రెడ్డి వ‌ర్గీయుల‌పై అదే ఆది వ‌ర్గీయులు దాడి చేసేందుకు రెడీ కావ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. చివ‌రికి ఏమ‌వుతుందో చూడాలి.

5 Replies to “జేసీ దివాక‌ర్‌రెడ్డి వ‌ర్సెస్ ఆదినారాయ‌ణ‌రెడ్డి”

  1. కూటమి అని మర్చి పోయారు ఏంట్రా…వాటాలు ఎలా పంచుకోవాలో చంబా బాబా ను అడగండి.Fly yash ను కూడా వదలటం లేదు.

Comments are closed.