టీడీపీ, వైసీపీ మధ్యలో పుష్పరాజ్?

పుష్ప-2 క్రేజ్ ను తమవైపు తిప్పుకునేందుకు కొంతమంది ఇలా చేస్తున్నారా లేక అల్లు అర్జున్ తమవాడు అని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారా?

సినిమాలకు, రాజకీయాలకు సంబంధం లేదు. మరీ ముఖ్యంగా పాలిటిక్స్ తో సంబంధం లేకుండా కెరీర్ పై మాత్రమే దృష్టి పెట్టే హీరోల సినిమాల్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఎందుకో పుష్ప-2 సినిమాకు పొలిటికల్ కలర్ యాడ్ అవుతున్నట్టు కనిపిస్తోంది.

పుష్ప-2 సినిమాపై భారీ అంచనాలున్నాయి. సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా చూద్దామని చాలామంది వెయిటింగ్. ఇలాంటి టైమ్ లో వైసీపీ నేతలు కొంతమంది పుష్ప-2పై కామెంట్స్ చేయడాన్ని ఎలా చూడాలి?

పుష్ప-2 క్రేజ్ ను తమవైపు తిప్పుకునేందుకు కొంతమంది ఇలా చేస్తున్నారా లేక అల్లు అర్జున్ తమవాడు అని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? ఈ రెండింటిలో ఏది చేసినా ప్రమాదమే. అది కూటమి ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించే వ్యవహారమే.

నిజానికి అల్లు అర్జున్ కు రాజకీయాలకు సంబంధం లేదు. తన స్నేహితుడు కాబట్టి, శిల్పాకు మద్దతుగా నంధ్యాల వెళ్లానని అప్పట్లో బన్నీ విస్పష్టంగా ప్రకటించాడు. అంతేకాదు, ఎప్పుడూ వైసీపీ మద్దతుగా ఆయన మాట్లాడలేదు. అలాఅని మరే ఇతర పార్టీని ఆయన పొగడలేదు. కానీ కొంతమంది బన్నీపై అప్పట్లో విరుచుకుపడ్డారు. కాంపౌండ్ లో ఆ సెగ ఇంకా రేగుతూనే ఉంది.

ఇలాంటి టైమ్ లో వైసీపీ నేతలు కొంతమంది పుష్ప-2పై పనిగట్టుకొని మాట్లాడ్డం కూటమిలో కొంతమందికి ఆగ్రహం తెప్పించి ఉండొచ్చు.

సినిమా సెన్సార్, విడుదలపై రాజకీయ నాయకులు దృష్టి పెడితే పరిణామాలు ఎంత ఘోరంగా ఉంటాయో గతంలో తమిళనాడు రాజకీయాల్లో చాలానే చూశాం. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ సైతం ఒక దశలో మౌనంగా కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది.

అదృష్టవశాత్తూ అంతటి దయనీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడూ రాలేదు. భవిష్యత్తులో కూడా రాకూడదనే కోరుకుందాం.

18 Replies to “టీడీపీ, వైసీపీ మధ్యలో పుష్పరాజ్?”

  1. మొత్తానికి మన వైసార్సిపీ ఘనాపాటీలు తమమైలేజీ కోసం పుష్పాన్ని ఎర్రిపుష్పం చేస్తున్నారు అంటావు

  2. రాజకీయానికి శవాలు దొరక్క పాపం చివరకు ఈ డ్రామాలు start చేశారా GA….😂😂😂…SO SAD…

  3. నా ఒపీనియన్ ప్రకారం… బన్నీ గారు చెప్పింది అక్షరాలా నిజం..తమ ఏ పార్టీకి చెందిన వాడిని కాను అని. కానీ.. చాలా స్ట్రాటజిక్ గా ఇటు పవన్ గారి ఓ ట్వీట్… అటు శిల్ప గారి కోసం ప్రచారం చేసి… ఏ ప్రభుత్వం వచ్చినా తన సినిమాలకు ఇబ్బంది లేకుండా ఉండాలని భావించి ఉంటారు కానీ పవన్ గారు ఫ్యామిలీ సభ్యులు అవ్వడం వలన ఇది పెద్ద దుమారం రేగింది.

    1. నా ఒపీనియన్ ప్రకారం అసలు బన్నీ సినిమా ఇబ్బందుల గురించి ఆలోచించలేదు, కేవలం స్నేహం మీదే శిల్పగారి కోసం ప్రచారానికి వెళ్లి ఉండొచ్చు….. మంచో చెడో ప్రతీ ఒక్కరికి వాళ్ళ సొంత అభిప్రాయం ఉంటుంది, ఉండటంలో తప్పు లేదు అనే విచక్షణా జ్ఞానం లేని నాగబాబు లాంటి వాళ్ళ ఓవర్ యాక్షన్ మూలంగా పెద్ద దుమారం రేగింది అని అనిపిస్తోంది

  4. నువ్వు, మీ పార్టీ వాళ్ళే బన్నీని రాజకీయంగా వాడుకొని మైలేజ్ పొందాలని చూడాలి.

    ఐనా బన్నీ రాజకీయంగా ప్రభావం చూపాలంటే, అతను ఇప్పటి వరకూ చేసిన ప్రయాణానికి ఎన్నో రెట్లు మరియు ఎంతో భిన్నమైన ప్రయాణం చెయ్యాలి, అది అయ్యే పని కాదులే.

    అయినా సింగిల్ సింహం పార్టీవాళ్ళు వాళ్ళనీ వీళ్ళని రాజకీయంగా వాడుకొని మైలేజ్ పొందాలని చూడటం ఏమిటి? ఇది మీ పార్టీ దుస్థితిని తెలియజేయడమే కదా! అందుకే రాసే ముందు కాస్త ఆలోచించి రాయి. నీలాంటోడు ఒక్కడు చాలు ఏ పార్టీయైనా సర్వనాశనం కావడానికి.

  5. అప్పట్లో రజనీకాంత్ ని తిట్టింది మీ దండుపాళ్యం ముఠానే కదా రా అయ్యా

    ఆయన చేసిన పాపం అల్లా చంద్రబాబు మంచి అడ్మినిస్ట్రేటర్ అన్నాడు

    దానికి బ్లూ ఫిల్మ్స్ టీమ్ క్యాబరే టీమ్ మురిపోయున గుడ్ల టీమ్ డాడీ చేశారు కదరా మల పత్రాష్టులారా

  6. 30 ఏళ్ళు నాదే అధికారం అనుకున్న ఒక చెత్త కుల నాయకుడు .. కులగజ్జి బొకాడో గాడు .. 5 ఏళ్లకే ప్రతిపక్ష హోదా ఇమ్మని కనపడిన ప్రతి ఒక్కడి కాళ్ళు పట్టుకొని పొర్లు దండాలు పెడుతున్నాడు .. ఇది కదా దేవుడి స్క్రిప్ట్ అంటే

      1. తండ్రి నీ , చిన తండ్రి నీ సి*ఎం ప*దవి కోసం లేపే*సి న వాడికి

        ఈక్వల్ అండ్ ఆపోజిట్ యాక్షన్ అంటే ఏమి వుంటది?

Comments are closed.