ప్రతి చిన్న దానికి అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు, తాడిపత్రి పోలీసు స్టేషన్ ముందు బైఠాయించి దర్నా చేయడం పరిపాటిగా ఉన్నట్లు కనపడుతోంది. తాము గాంధేయ వాదులం అంటూనే తాడిపత్రిలో నేనే రౌడీ అని చెప్పుకునే తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాజాగా పోలీసు స్టేషన్ ముందు దర్నాకు దిగారు.
గత వారం నుండి టీడీపీ కౌన్సిలర్లపై వైసీపీ నేతలు దాడులు చేస్తునరంటూ పోలీసు స్టేషన్ ముందు బైఠాయించి హైడ్రామా సృష్టించారు.దర్నాలో మాట్లాడుతూ జగన్ పై, స్ధానిక ఎమ్మెల్యేపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడరు. తాడిపత్రిలో టీడీపీ ప్రభుత్వంలో కంటే ఇప్పుడే క్రైం రేటు తగ్గిందని గణాంకాలు చెప్పుతున్నా నేను అప్పట్లో గాంధీ గిరి చేశాను. ఇప్పుడు వైసీపీ పాలనలో తాడిపత్రిలో శాంతి భద్రతలు నశించి పొయాయి అంటూ డ్రామాలు అడుతున్నారంటూన్నారు వైసీపీ నేతలు.
దాదాపు 30 సంవత్సరాలు పాటు తాడిపత్రిని గుప్పెట్లో పెట్టుకోని జేసీ బ్రదర్స్ చేసిన అరాచకం అక్కడి అందరి తెలుసూ అని, కానీ ఇప్పుడు ఏదో జరిగిపోతుందని, జగన్ పై బూతులు మాట్లాడితే చంద్రబాబు అనుకూల మీడియాలో బాగా చూపిస్తురనే భ్రమలో ఉండి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూన్నరంటూ జేసీ ప్రభాకర్ రెడ్డిపై మండిపడుతున్నారు వైసీపీ నేతలు.
పదే పదే సీఎంపై, వైసీపీపై విమర్శలు చేయడం, పోలీసులతో దూరుసుగా ప్రవర్తించడమే రాజకీయం అనేలాగా ఉంది జేసీ బ్రదర్స్ వ్యవహారం. మేము వస్తే వైసీపీ నేతలు తాడిపత్రిలో తిరగనివ్వము అని బెదిరించడం జేసీ బ్రదర్స్ కు అలవాటు అయినట్లు ఉంది. ఇప్పటికైనా అవుట్ డేటెడ్ రాజకీయాలు మాని ప్రజల కోసం పోరాడితే ప్రజలు గుర్తిస్తారంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
J.c travel bus accident jarigi yentho mandhi pranalu kolpoyaru