విశాఖ నుంచి ఎంపీగా అంటున్న కేఏ పాల్

కేఏ పాల్. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. మత ప్రభోదకుడుగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఆయన తెలిసిన వారే. గత అయిదేళ్లుగా ప్రజాశాంతి పార్టీ పెట్టి రాజకీయాల్లోనూ ఉంటున్నారు.  Advertisement కేఏ పాల్…

కేఏ పాల్. ఈ పేరుకు పరిచయం అవసరం లేదు. మత ప్రభోదకుడుగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఆయన తెలిసిన వారే. గత అయిదేళ్లుగా ప్రజాశాంతి పార్టీ పెట్టి రాజకీయాల్లోనూ ఉంటున్నారు. 

కేఏ పాల్ విశాఖ నుంచి పోటీ చేస్తాను అని బాంబు పేల్చారు. ఆయన గురువారం విశాఖ మీడియాతో మాట్లాడుతూ తనకంటే విశాఖ ఎంపీగా పోటీకి ఎవరు అర్హుడని కూడా అంటున్నారు. తాను పక్కా లోకల్ అని పాల్ చెప్పుకున్నారు. నేను విశాఖ వాసిని, విశాఖ నుంచి ఈసారి ఎంపీగా పోటీ చేసి తీరుతాను అని కేఏ పాల్ స్పష్టం చేశారు.

తాను ఇక మీదట విశాఖలోనే మకాం పెడతానని, విశాఖలోనే ఉంటూ తన రాజకీయం ఏంటో చూపిస్తాను అని ఏపీలోని రాజకీయ పార్టీలకు సవాల్ విసిరారు. అన్ని రాజకీయ పార్టీలు బీజేపీకి తొత్తులుగా మారాయని పాల్ తీవ్ర విమర్శలు చేశారు. విశాఖకు మేలు చేసే పార్టీ ఏదీ లేదని, అందుకే తానే పోటీ పడాలని నిర్ణయించానని పాల్ అంటున్నారు.

విశాఖ దగ్గర తగరపువలస పాల్ సొంత ప్రాంతం. ఆయన తాను విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి ఈ ప్రాంతం సమస్యలు పరిష్కరిస్తాను అని అంటున్నారు. తన కంటే విశాఖ సమస్యల గురించి తెలిసిన వారు లేరని ఆయన అంటున్నారు. కేఏ పాల్ 2024 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయడం ఖాయమని బల్లగుద్దుతున్నారు. తనదే గెలుపు  అని, తాను ఇక మీదట విశాఖ పాల్ ని అని కూడా అంటున్నారు.