సొంత గడ్డ నుంచి కే ఏ పాల్ యాత్ర‌

కే ఏ పాల్. ఈ పేరు అందరికీ తెలిసిందే. ఆయన మత ప్రబోధకుడు. అంతే కాదు ప్రజా శాంతి పార్టీ ప్రెసిడెంట్. ఇక వచ్చే ఎన్నికల మీద అందరి కంటే కే ఏ పాల్…

కే ఏ పాల్. ఈ పేరు అందరికీ తెలిసిందే. ఆయన మత ప్రబోధకుడు. అంతే కాదు ప్రజా శాంతి పార్టీ ప్రెసిడెంట్. ఇక వచ్చే ఎన్నికల మీద అందరి కంటే కే ఏ పాల్ కే ఎక్కువ ఫోకస్ ఉన్నట్లుగా ఉంది. అందుకే ఆయన జనాల్లోకి వచ్చేందుకు రెడీ అయిపోతున్నారు.

ఈ నెల 9వ తేదీ నుంచి కే ఏ పాల్ ప్రజా యాత్రను చేపట్టనున్నారు. ఇక ఈ ప్రజాయాత్రను ఆయన తాను పుట్టిన జిల్లా సొంత గడ్డ విశాఖపట్నం నుంచే మొదలెడతారట. 

విశాఖ జిల్లాలో ప్రజా యాత్ర ద్వారా ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరిస్తారట. ఇక ప్రజలు తమ సమస్యలను కే ఏ పాల్ కి చెప్పుకుంటే ఆయన వాటికి తగిన పరిష్కారం చూపుతారట. అంతే కాదు ఆయన స్వయంగా ప్రజా సమస్యలను గుర్తించి వాటి మీద పోరాడుతారుట.

ఇక కే ఏ పాల్ ప్రజా యాత్ర విశాఖ నుంచి మొదలుపెట్టి ఈ నెల 15న కర్నూల్ లో ముగిస్తారుట. ఇప్పటిదాకా తెలంగాణాలో ఉంటూ అక్కడ కేసీయార్ సర్కార్ మీద విమర్శలు చేస్తున్న కే ఏ పాల్ సడెన్ గా ప్రజా యాత్ర పేరిట ఏపీకి రావడం మాత్రం చిత్రంగానే ఉంది. ఆయన ఏం మాట్లాడుతారో ఏమిటో చూడాలి మరి.