వైసీపీ గొప్పగా చెప్పుకోవాల్సిన టైమ్…

వైసీపీ ఏలుబడిలో ఏపీని అంతా సర్వనాశనం చేశారు. ఏ ఒక్క ప్రాజెక్టూ లేదు అంటూ పదే పదే టీడీపీ విమర్శలు చేస్తూ ఉంటుంది. విశాఖను మేము ఎంతో చేయాలనుకున్నాం, మీరు ఏమీ చేయలేదు అని…

వైసీపీ ఏలుబడిలో ఏపీని అంతా సర్వనాశనం చేశారు. ఏ ఒక్క ప్రాజెక్టూ లేదు అంటూ పదే పదే టీడీపీ విమర్శలు చేస్తూ ఉంటుంది. విశాఖను మేము ఎంతో చేయాలనుకున్నాం, మీరు ఏమీ చేయలేదు అని కూడా ఆడిపోసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.

మరి దానికి ధీటైన జవాబు ఇపుడు వైసీపీ నేతలు చెప్పుకోవచ్చు. అది కూడా బాగా గొప్పగా ప్రకటించుకోవచ్చు. దేశంలోనే ప్రముఖంగా వినిపించే పేరు రహేజా సంస్థదే. మహా నగరాల్లో ఆ సంస్థ  భారీ మాల్స్ ఎన్నో ఏర్పాటు చేసింది.

మరి నాడు టీడీపీ టైమ్ లో విశాఖను బాగా డెవలప్మెంట్ చేశామని చెప్పుకున్న వారికి రహేజా ఎందుకు కనిపించలేదో కానీ వైసీపీ సర్కార్ మాత్రం వారిని ఒప్పించి విశాఖకు రప్పించింది అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. దాని ఫలితంగా త్వరలో విశాఖలో పదిహేడు ఎకరాల సువిశాల స్థలంలో ఇనార్బిట్ మాల్‌ ను ర‌హేజా గ్రూప్‌ నిర్మించ‌నుంది.

ఒక విధంగా ఈ నిర్మాణం పూర్తి అయితే విశాఖ ప్రతిష్ట పెరుగుతుంది. వాణిజ్య నగరంగా ఖ్యాతి మరో మెట్టు పెరగనుంది. ఇక విశాఖ నడిబొడ్డున నౌకాయాన సంస్థ వారి స్థలాన్ని లీజుకు తీసుకుని మరీ రహేజా తన యాక్టివిటీ స్టార్ట్ చేస్తోంది. 

ఇక మీదట విశాఖకు మీరు ఏం చేశారు అని టీడీపీ వారు అడిగితే ఈ భారీ మాల్ ని చూపించవచ్చు. మరి ప్రచారంలో వెనకబడుతున్న వైసీపీకి ఇలాంటి మరిన్ని ప్రాజెక్టుల గురించి చెప్పుకుంటేనే విపక్షాల విమర్శలను తిప్పికొట్టగలదని అంటున్నారు.