నటనకు ఓకే… రాజకీయాల‌కు ప‌నికిరాడు!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై  వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోర్థన్‌రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సొంత జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న నెల్లూరులో ఇవాళ మీడియాతో మాట్లాడారు. కోర్టులో త‌న…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై  వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోర్థన్‌రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సొంత జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న నెల్లూరులో ఇవాళ మీడియాతో మాట్లాడారు. కోర్టులో త‌న కేసుకు సంబంధించి ఫైల్స్ చోరీకి గురికావ‌డం, అలాగే పార్టీలో విభేదాల‌పై ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ నటనకు సరిపోతారే త‌ప్ప‌ రాజకీయాల్లో పనికి రార‌ని తేల్చి చెప్పారు.  

కోర్టు ఫైల్స్‌ చోరీ వెనుక కుట్ర ఉందని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఓ పథకం ప్రకారమే నెల్లూరు కోర్టులో ఫైల్స్‌ చోరీ జరిగిందన్నారు. త‌న‌ను బద్నాం చేయడానికే… కోర్టులో ఫైల్స్‌ చోరీ జరిగినట్టు అనుమానం వ్యక్తం చేశారు. దొంగతనం చేసి కాగితాలు బయటపడేస్తారా? అని ప్రశ్నించారు. పథకం ప్రకారం కావాలని చేసి ఉండొచ్చ‌ని అనుమానం ఉందని తెలిపారు. టీడీపీకి సందేహాలుంటే హైకోర్టు ద్వారా సీబీఐ విచారణ కోరాలని కాకాణి సూచించారు.  

మాజీ మంత్రి అనిల్‌కుమార్‌తో తనకు విభేదాలు లేవని మంత్రి కాకాణి స్ప‌ష్టం చేశారు. పార్టీలోని నేతలందరం కలిసిమెలిసి పనిచేస్తున్నామన్నారు. తమ మధ్య విభేదాలు ఉన్నప్పుడు విద్రోహులు ప్రవేశిస్తారన్నారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్‌ యాదవ్‌ ఫ్లెక్సీలు తాను, తన ఫ్లెక్సీలు ఆయన చించరని స్ప‌ష్టం చేశారు. ఇద్దరి మధ్య విబేధాలను పెంచేందుకు  కొంతమంది ఫ్లెక్సీలను చించివేశారని అన్నారు. ఎవరూ ఫ్లెక్సీలను కావాలని తొలగించరని తెలిపారు.

తన మీద 2017లో సోమిరెడ్డి కేసు పెట్టారని, టీడీపీ ప్రభుత్వ హయాంలో రెండు సార్లు చార్జిషీట్ వేస్తే కోర్టు అది సరైన కేసు కాదని తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. త‌మ పార్టీ అధికారంలోకి వచ్చాక చార్జిషీట్ ఫైల్ అయ్యిందన్నారు. దొంగతనాలు చేయాల్సిన అవసరం తనకు లేదని స్ప‌ష్టం చేశారు. మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి ఇటీవ‌ల త‌న స‌భ‌లో గ‌త మూడేళ్ల‌లో సాగిన అభివృద్ధిపై చేసిన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించి చేసినవి కాదన్నారు.