ప్రాజెక్టు అంటే ఇదీ..లాభాలు అంటే ఇవీ

రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్ మెంట్ అన్నది ఏ వ్యాపారానికైనా కీలకం అని నిన్నే పక్కా డిటైల్డ్ గా వివరించాం. కేజీఎఫ్ 2 ప్రాజెక్టు ఏ విధంగా ఏ మేరకు లాభదాయకం అన్నది చూద్దాం. ఆ…

రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్ మెంట్ అన్నది ఏ వ్యాపారానికైనా కీలకం అని నిన్నే పక్కా డిటైల్డ్ గా వివరించాం. కేజీఎఫ్ 2 ప్రాజెక్టు ఏ విధంగా ఏ మేరకు లాభదాయకం అన్నది చూద్దాం. ఆ సినిమాకు అయిన ఖర్చు 280 కోట్లు. 

కేవలం నాన్ థియేటర్ హక్కుల రూపంలోనే 200 కోట్లు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేవలం అడ్వాన్స్ ల రూపంలోనే మిగిలిన ఆ ఎనభై కోట్లు వచ్చేసాయి. ఇప్పుడు ఆ మొత్తం నుంచి ఎంతో కొంత వెనక్కు ఇవ్వాల్సి వున్నా నష్టం లేదు.  

ఎందుకంటే తమిళనాడు, కర్ణాటక, కేరళ, హిందీ వెర్షన్, ఓవర్ సీస్ వీటన్నింటిని కలిపి వందల కోట్లు వచ్చి పడబోతున్నాయి. ఇప్పటికే ఇవన్నీ కలిపి 300 కోట్ల వరకు వచ్చాయి. ఇవన్నీ లాభాల్లోకే. సినిమాకు హీరో, డైరక్టర్ రెమ్యూనిరేషన్ కాకుండా లాభాల్లో సమాన వాటా తీసుకుంటున్నారని తెలుస్తోంది. అంటే మొత్తం మూడు వాటాలు. 

అదే ఆర్ఆర్ఆర్ ను చూస్తే 525 కోట్ల మేరకు ఖర్చయింది. థియేటర్ల హక్కుల అమ్మకాల మీద ఆ మేరకు రికవరీ వచ్చేసింది. నాన్ థియేటర్ హక్కులు 200 కోట్ల కు అటు ఇటు గా వచ్చినట్లు తెలుస్తోంది. అదే లాభం. ఓవర్ ఫ్లోస్ ఎలాగూ వుండవు. తిరిగి వెనక్కు ఇవ్వాల్సింది వుంటే తరువాత సినిమాల్లో చూసుకుంటారు. 

కేజీఎఫ్ 2 కు ఖర్చు తక్కువ. ఆర్ఆర్ఆర్ కు స్టార్ కాస్ట్ ఎక్కువ. అలాగే ప్రొడక్షన్ లో రాజమౌళి కుటుంబ సభ్యులు అంతా ఏదో ఒక డిజిగ్నేషన్ తో వుంటారు. వారందరి రెమ్యూనిరేషన్లు. తెలుగునాట వదిలేస్తే మిగిలిన ఏరియాల్లో భీభ‌త్సమైన పబ్లిసిటీ. అందువల్ల ఖర్చు ఎక్కువ.