చీపురుపల్లిలో ల్యాండ్ అయిన కళా!

చీపురుపల్లి టికెట్ ని మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావుకు టీడీపీ కేటాయించింది. ఆయన ఎచ్చెర్ల టికెట్ ఆశించారు. కానీ చివరకు చీపురుపల్లి వెళ్ళక తప్పింది కాదు. చీపురుపల్లి టికెట్ ఆశించి భంగపడింది కళా…

చీపురుపల్లి టికెట్ ని మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావుకు టీడీపీ కేటాయించింది. ఆయన ఎచ్చెర్ల టికెట్ ఆశించారు. కానీ చివరకు చీపురుపల్లి వెళ్ళక తప్పింది కాదు. చీపురుపల్లి టికెట్ ఆశించి భంగపడింది కళా తమ్ముడు కొడుకు నాగార్జున.

ఆయనకు అధినాయకత్వం హామీ ఇచ్చింది. వివాదం కొంత సర్దుకున్నాక పెద్దాయన చీపురుపల్లిలో ల్యాండ్ అయ్యారు. బొత్స మీద తన విజయం తధ్యమని ఆయన అంటున్నారు. అరాచక పాలన ఏపీ నుంచి పోవడానికే బాబు కృషి చేస్తున్నారని అందుకే తనను కోరి మరీ చీపురుపల్లికి పంపించారు  అని కళా అంటున్నారు. తన తమ్ముడు కుమారుడు నాగార్జున తమ ఇంటి బిడ్డ అని ఆయన భవిష్యత్తుని తాను చూసుకుంటాను అని కళా అంటున్నారు. ముందు వైసీపీని ఓడించడం ముఖ్యమని ఆయన అంటున్నారు.

ఆ పని తమ్ముడు కొడుకు చేయలేడని టికెట్ ఇచ్చారా అంటే పరిస్థితులు కారణం అంటున్నారు పెద్దాయన. అసలు టికెట్ లేక కొంతమంది సీనియర్లు టీడీపీలో కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. కళాకు అలా జరగకుండా చీపురుపల్లి టికెట్ అయినా ఇచ్చారు అన్న సంతృప్తి ఆయనలో క్యాడర్ లో ఉంది.

అందుకే ఎచ్చెర్ల టికెట్ లేదని నొచ్చుకున్నా ఆనక అన్నీ గ్రహించి ఆయన చీపురుపల్లిలో పోటీకి రెడీ అయిపోయారు. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణకు పట్టుంది. ఆయన కాంగ్రెస్ తరఫున ఏపీ విభజన తరువాత పోటీ చేసినా యాభై వేల దాకా ఓట్లు వచ్చాయి. రెండు దశాబ్దాలుగా చీపురుపల్లిలో బొత్స హవా సాగుతోంది. చివరి నిముషంలో వచ్చిన కళా బొత్సను ఓడిస్తామని అంటున్నారు. ఆయన గెలుస్తారా లేదా అన్నది అటుంచితే ఈ ఇద్దరు నేతల మధ్య పోరు రసవత్తరంగా ఉంటుందని అంటున్నారు.