ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీకి వచ్చిన నష్టం లేదు. అలాగాని లాభం కూడా లేదు. ఎందుకంటే నోటాతో పోటీ పడే బీజేపీలో ఎంత మంది కన్నా లాంటి నాయకులు చేరినా పార్టీకి వచ్చే ప్రయోజనం ఏమీ వుండదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీని కేవలం స్వార్ద రాజకీయాలకు మాత్రమే వాడుకుంటారనేది జగమెరిగిన సత్యం. ఉదాహరణ చెప్పాలంటే ప్రస్తుతం బీజేపీ ఉండి పచ్చ గాలి పీల్చే నాయకులు కోకొల్లలు.
కన్నా రాజీనామా గురించి మాట్లాడుకోవాడానికి ఒక్కటే కారణం. ప్రస్తుతం జనసేన-బీజేపీ అధికారంగా పొత్తులో ఉన్నాయి. టీడీపీతో జనసేన అనధికారిక పొత్తులో వుంది. జనసేన కాపురం ఒకరితో, సహజీవనం మరొక పార్టీతో అని జనం చేస్తున్న విమర్శ. జనసేన పార్టీకి టీడీపీతో పాటు బీజేపీ కూడా కావాలి. తనతో పాటు బీజేపీని కూడా టీడీపీకి మద్దతు ఇచ్చేలా చేయాలని పవన్‌కల్యాణ్ పట్టుదలతో ఉన్నారు.
అయితే పవన్ ఆలోచనల్ని పసిగట్టిన బీజేపీ, ఆయన్ను దూరంగా పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే ఇటీవల కాలంలో మొదట జనంతో, ఆ తర్వాత జనసేనతో పొత్తు అని బీజేపీ నేతలు మాట్లాడాన్ని గమనించొచ్చు. టీడీపీతో మరోసారి పొత్తు కుదుర్చుకుని నష్టపోవడం బీజేపీకి ఎంత మాత్రం ఇష్టం లేదు.
కన్నా లక్ష్మీనారాయణ లాంటి వారు జనసేనలోకి వెళితే మాత్రం బీజేపీ అసలు ఒప్పుకోదు. టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటుందని తెలిస్తే మాత్రం కన్నా ఇలాంటి పనులు చేయరనేది తెలిసిందే. బహుశా బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోను టీడీపీతో పొత్తు పెట్టుకోదనే క్లారిటీతో కన్నా టీడీపీలోకి వెళ్లబోతున్నారు. కన్నా టీడీపీలోకి వెళ్లితే జనసేన- టీడీపీ పొత్తుకు రూట్ క్లియర్ చేసిన వ్యక్తిగా కన్నా నిలబడుతారు. ఎందుకంటే ఇరు పార్టీల అధినేతలను అరాధించే నాయకుడు కన్నా మాత్రమే కాబట్టి.