తెలుగుదేశం పార్టీ తామే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని పదే పదే ఊదరగొడుతోంది. మహానాడు సూపర్ హిట్ అయింది కాబటి ఇక చూసుకో మా తడాఖా అంటున్నారు తమ్ముళ్ళు. అయితే దానికి మించి వైసీపీ ప్లీనరీ కూడా డబుల్ సూపర్ హిట్ అయిన దాన్ని మరచిపోతున్నారని వైసీపీ నుంచి కూడా కౌంటర్లు పడుతున్నాయి.
ఈ నేపధ్యంలో ప్రభుత్వ విప్ గా కొత్తగా నియమితులైన సీనియర్ వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తాడేపల్లిలో జగన్ని కలసి విశాఖలోకి అడుగుపెట్టిన వెంటనే టీడీపీకి పిడుగు లాంటి వార్త ఒకటి చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి విశాఖలో ఉన్న 15 అసెంబ్లీ సీట్లు పూర్తిగా వైసీపీయే గెలుచుకుంటుందని పక్కా క్లారిటీగా చెప్పారు. ఈ విషయంలో ప్రత్యర్ధులకు ఏ రకమైన డౌట్లూ అవసరం లేదన్నారు. ఇక మెజారిటీలు కూడా గతం కంటే ఈసారి వైసీ;పీకి అత్యధికంగా వచ్చేలా చూస్తామని అన్నారు.
విశాఖలో గత ఎన్నికల్లో నాలుగు సీట్లు టీడీపీకి వస్తే వైసీపీకి 11 వచ్చాయి. ఇపుడు టోటల్ జిల్లా అంతా మాదే అని కరణం ధర్మశ్రీ చెబుతున్నారు. జనాల నుంచి వస్తున్న ఆదరణకు తోడు జగన్ కి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని అన్ని సీట్లూ గెలిచి తమ సత్తా చాటుతామని ధర్మశ్రీ చెప్పారు.
రాజకీయాల్లో ప్రకటనల సంగతి ఎలా ఉన్నా ఇలాంటి మాటలు వింటే మాత్రం ప్రత్యర్ధి టీడీపీకి కాస్తా గుండె చెదరడం సహజమని వైసీపీ నేతలు అంటున్నారు.