మాజీమంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై ఏపీ బీజేపీ ఇన్ ఛార్జ్ సునీల్ దియోధర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కొడాలి నాని రియాక్ట్ అయ్యారు. 'సునిల్ దియోధర్ పకోడీ లాండి వారని.. ఇలాంటి పకోడీ గాళ్ల వల్లే బీజేపీ కర్ణాటకలో ఓడిపోయిందని… అన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని నరేంద్ర మోడీ, అమిత్ షా ప్రయత్నిస్తుంటే మధ్యలో ఈ పకోడీ గాడెవడు అంటూ… ఇలాంటి దరిద్రులను పెట్టుకుంటే బీజేపీ నశనం అవుతుందని' ఫైర్ అయ్యారు.
కాగా గుడివాడలో బీజేపీ నిర్వహించిన ఓ సభలో సునీల్ దియోధర్ మాట్లాడుతూ.. కొడాలి నాని లాంటి వారిని అసెంబ్లీలోకి అడుగు పెట్టనివ్వకూడదని.. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తే కొడాలి నాని లాంటి వారిని జైలుకు పంపుతామని ఘటూ వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ.. ఏపీలో నోటాతో పొటీ పడే బీజేపీ నేతలు కూడా రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం అని ప్రకటించుకోవడం విశేషం.
పార్టీ పటిష్టతకు కోసం పని చేయకుండా పక్క పార్టీలను నమ్ముకుని రాజకీయం చేసే బీజేపీ నేతలు.. నేను చంద్రబాబు మనిషిని.. నేను మీకు కావాలంటే మీరు చంద్రబాబును కలుపుకోవాలని డైరెక్ట్ గా డిమాండ్ చేస్తున్నా కూడా జనసేనతో పొత్తులో ఉన్నాం అంటూ పదేపదే ప్రకటించుకోవడం గమనార్హం.