ఎన్నో నెలల నుండి ఊరిస్తూ.. ఊరిస్తూ యాత్ర మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్‌ను ఆదిలోనే మాజీ మంత్రులిద్దరు చెడుగుడు ఆడుకుంటున్నారు. ఆ ఇద్దరు ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన వారు కాగా వారి పేర్లు కూడా నాని కావడం విశేషం. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాజీ మంత్రి పేర్ని నాని పవన్ కళ్యాణ్‌ను ర్యాగింగ్ చేస్తే.. ఇవాళ బహిరంగ సభలో కొడాలి నాని పవన్ పరువు మొత్తం తీసేసారు.
గుడివాడ సభలో కొడాలి మాట్లాడుతూ.. సీఎం అవుతానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్.. జగన్ దెబ్బకు ఎమ్మెల్యే కావడమే లక్ష్యంగా పెట్టుకున్నారని.. బీజేపీ టీడీపీని కలుపుకున్నా ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి లేదన్నారు. ఇండిపెండెంట్‌గా హీరోయిన్లు.. నవనీత్ కౌర్, సుమలత కూడా ఎంపీలుగా గెలిచారు కానీ పవన్ పార్టీ పెట్టిన ఎమ్మెల్యేగా కాలేకపోయారని ఎద్దేవా చేశారు.
పవన్ కోరిక అసెంబ్లీ లో అడుగుపెట్టడం చంద్రబాబు కోరిక ప్రతిపక్ష నేత కావడం అంటూ సెటైర్లు వేశారు. జగన్‌ను ముఖ్యమంత్రి పీఠం నుంచి దించే దమ్ము ఎవ్వరికి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా సీఎంగా జగన్.. గుడివాడ ఎమ్మెల్యేగా కొడాలి నానినే ఉంటారని స్పష్టం చేసారు.