గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారిన హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై మాజీ మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో స్పందించారు. రాష్ట్రంలో ప్రతి పక్ష టీడీపీ నేతలు ప్రజా సమస్యలను వదిలేసి వీడియోపై రాజకీయ రచ్చ చేయడం సిగ్గు చేటు అని విమర్శించారు.
ఆ వీడియో ఫేక్ అని పోలీసులు తెలిపినా టీడీపీ కావాలని రాద్దాంతం చేస్తున్నారని, లింగ పరిశోధనలలో నిష్ణాతులైన టీడీపీ వాళ్లు రాష్ట్రంలో ఏది ఏవరిదో కూడా తేల్చి ఐడి కార్డులు ముద్రిస్తారంటూ టీడీపీ నేతలపై కాస్తా ఘాటుగా స్పందించారు. మాధవ్ ది పట్టుకుని వేలాడినా వైసీపీని, జగన్ ను ఇంచు కూడా కదల్చలేరన్నారు.
వీడియోలో కనిసిస్తోంది టీడీపీ నేతల శరీరాలు అని.. వాటికి మోహం మాత్రం వైసీపీ నేతలది టీడీపీ సోషల్ మీడియా టీం పెడుతున్నారని కొడాలి నాని అరొపించారు. ఆ వీడియో తనది కాదని ఎంపీ చెప్తున్నా సిగ్గు, శరం లేకుండా ఎల్లో మీడియాలో డిబెట్లు పెడుతున్నరాని విమర్శించారు.
నిజంగా టీడీపీ నేతలు ఒకటే విషయాన్ని పదేపదే చెప్తుంటే నిజం అవుతుందనే భ్రమలో ఉన్నారని అనిపిస్తోంది. వీడియోలో ఎవరూ ఉన్నారో లేరో ఏదో ఒక రోజు బయట వస్తుంది. కానీ చంద్రబాబు, లోకేష్ మాత్రం ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై పోరాటలు చేయాకుండా ఆడియోలు, వీడియోలు సృష్టించుకుంటూ ఉంటే ఎల్లో మీడియాలో డిబెట్లు, ఎల్లో రాతల్లో బాగుంటుంది కాని ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదు కదా.