దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా, రష్మిక మందన కీలక పాత్రలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై నిర్మించిన చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వంలో తయారైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ నేపధ్యంలో 'సీతారామం'కు చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ చిత్ర యూనిట్ థాంక్ యూ మీట్ నిర్వహించింది. అక్కినేని నాగార్జున ఈ ఈవెంట్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
నాగార్జున మాట్లాడుతూ.. అశ్వినీదత్ కంటే నేను ఎక్కువగా ప్రేమించే వ్యక్తులు స్వప్న, ప్రియాంక. వాళ్ళిద్దరూ నాకు చిన్నప్పటి నుండి తెలుసు. దత్ గారికి వారిద్దరూ పెద్ద అండ. మహానటి, జాతిరత్నాలు, ఇప్పుడు సీతారామం .. వరుసగా అద్భుతమైన విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. సీతారామం చూసి చాలా జలసీ ఫీలయ్యాను. నాకు రావాల్సిన రోల్ దుల్కర్ కి వెళ్ళింది.( గీతాంజలి, సంతోషం, మన్మధుడు రోజులు గుర్తుకు వచ్చాయి. సీతారామం విజయం చాలా ఆనందాన్ని ఇచ్చింది. రొమాన్స్ మళ్ళీ తెరపైకి వచ్చింది. లవ్, రొమాన్స్ చిత్రాలని ప్రేక్షకులు మళ్ళీ గొప్పగా ఆదరించారు.
దర్శకుడు హను చాలా వివరంగా, అద్భుతంగా ఈ చిత్రాన్ని తీశారు. ఇంటర్వెల్ పాయింట్ లో ప్రేక్షకులని ఎవరూ ఊహించని రీతిలో లాక్ చేశారు. సెకండ్ హాఫ్ అత్యద్భుతంగా వుంది. ఇలాంటి సినిమా తీయడానికి ధైర్యం కావాలి. పాటల చిత్రీకరణ కూడా అందంగా వుంది. ఇంత అందమైన చిత్రం చూసి చాలా రోజులౌతుంది. ఈ క్రిడిట్ అంతా దర్శక నిర్మాతలు చిత్రం కోసం పని చేసిన అందరికీ దక్కుతుంది. మృణాల్ పాత్రలో ప్రేమలో పడిపోయా. అంత అందంగా వుంది.
ఎవరైనా ఆ పాత్రలో ప్రేమలో పడాల్సిందే. దుల్కర్ గొప్ప ఛార్మింగ్ వున్న నటుడు. దుల్కర్ ని చూడగానే ప్రేమగా హత్తుకోవాలనిపిస్తుంది. అంత గొప్ప ప్రజన్స్ దుల్కర్ లో వుంది. దుల్కర్ లో ఆ స్వచ్ఛత ఎప్పుడూ అలానే వుండాలని కోరుకుంటాను. తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనాలు. గత వారం విడుదలైన బింబిసార, సీతారామం చిత్రాలని గొప్పగా ఆదరించారు. మంచి సినిమా తీస్తే చూస్తామనే నమ్మకం ఇచ్చారు. ప్రేక్షకులకులందరికీ మరోసారి కృతజ్ఞతలు'' తెలిపారు.
దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. 'సీతారామం'ని ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాపై ప్రేక్షకుల చూపిస్తున్న ఆదరణ మాటల్లో చెప్పలేని గొప్ప అనుభూతిని ఇస్తుంది. 'సీతారామం'కు ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు మరోసారి కృతజ్ఞతలు.
మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. సీతారామం విజయం మాటల్లో చెప్పలేని గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. సినిమాని ఇంత గొప్ప ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ప్రేక్షకులకు మరోసారి పెద్ద థాంక్స్'' తెలిపారు.
దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.. గత 5వ తేది నుండి ఒక ఊహప్రపంచంలో బ్రతుకున్నట్లుగా వుంది. మాటల్లో చెప్పలేని అనుభూతి ఇది. నాలుగు సినిమాలు తీశాను. కానీ ఇంత ఆదరణ లేదు. మొదటిసారి ఈ ఆదరణ చూస్తున్న. ఇప్పటికీ మర్చిపోలేని ఫీలింగ్ ఇది. 'సీతారామం' నాకు బాగా దగ్గరైన కథ. 'సీతారామం' కథ దృశ్య రూపంలోకి మారడానికి చాలా మంది కృషి వుంది. తెరపై కనిపిస్తున్న రామ్ సీతలతో పాటు తెరవెనుక చాలా మంది మనిషి చేశారు. వారందరీకి పేరుపేరునా థాంక్స్. ఈ సినిమాని గొప్పగా ఆదరిస్తూ రిపీటడ్ గా చూస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు'' తెలిపారు.