టీడీపీకి త‌ల‌నొప్పిగా మారిన కొలిక‌పూడి

టీడీపీకి తిరువూరు ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావు త‌ల‌నొప్పిగా మారారు. ఏదో ర‌కంగా వార్త‌ల్లో వుండాల‌నే కుతూహ‌లంతో నోటికొచ్చిన‌ట్టు మాట్లాడ్డం, వింత‌గా ప్ర‌వ‌ర్తించ‌డం ఆయ‌న‌కే చెల్లింద‌ని సొంత పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ఆయ‌న…

టీడీపీకి తిరువూరు ఎమ్మెల్యే కొలిక‌పూడి శ్రీ‌నివాస‌రావు త‌ల‌నొప్పిగా మారారు. ఏదో ర‌కంగా వార్త‌ల్లో వుండాల‌నే కుతూహ‌లంతో నోటికొచ్చిన‌ట్టు మాట్లాడ్డం, వింత‌గా ప్ర‌వ‌ర్తించ‌డం ఆయ‌న‌కే చెల్లింద‌ని సొంత పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో ఆయ‌న ఎప్పుడూ లేరు. బోధ‌నా రంగం నుంచి నేరుగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. అంత‌కు ముందు అమ‌రావ‌తి ఉద్య‌మంలో పాల్గొన్నారు.

తిరువూరు నుంచి టీడీపీ త‌ర‌పున పోటీ చేసి గెలుపొందారు. గెలిచిన వెంట‌నే వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధికి చెందిన భ‌వ‌నాన్ని కూల్చేందుకు ఆయ‌న ఊరేగింపుగా వెళ్లారు. అధికారులు, పోలీసులు ఎంత‌గా చెప్పినా వినిపించుకోకుండా కూల్చివేత‌కు త‌నే న‌డుం బిగించారు. కొలిక‌పూడి తీరు స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. రెండు నెల‌ల క్రితం కొలిక‌పూడిని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు పిలిపించుకుని క్లాస్ పీకారు. అప్ప‌టి నుంచి ఆయ‌న్ను దూరం పెడుతున్న‌ట్టు వార్త‌లొచ్చాయి.

తాజాగా త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన డ్వాక్రా మ‌హిళ‌ల‌పై బూతులు మాట్లాడ్డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది. అంతేకాదు, మ‌హిళ‌ల‌ను అధికారికంగా ఐదు గంట‌ల పాటు పోలీస్‌స్టేష‌న్‌లో పెట్ట‌డం ద్వారా ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ఏర్ప‌డేలా చేసింది.

కొలిక‌పూడి వ్య‌వ‌హార శైలి ప్ర‌భుత్వంపై కేవ‌లం తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలోనే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా వ్య‌తిరేక ముద్ర ప‌డేలా చేస్తోంద‌న్న భ‌యం టీడీపీలో నెల‌కుంది. దీంతో కొలిక‌పూడిని ఎలా నిరోధించాలో అర్థం కాక టీడీపీ త‌ల ప‌ట్టుకుంది. కొలిక‌పూడిని ఇట్లే వ‌దిలేస్తే, రానున్న రోజుల్లో ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

7 Replies to “టీడీపీకి త‌ల‌నొప్పిగా మారిన కొలిక‌పూడి”

Comments are closed.