వైసీపీలో చురుకుగా ఉండే నేత. పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎంతో సందడి చేసిన ఆయన అయిదేళ్ల పాటు అధికార దర్పాన్ని అనుభవించారు. ఆయనే కోలగట్ల వీరభద్రస్వామి కేరాఫ్ విజయనగరం. రాజుల కోటలో పాగా వేసిన రాజకీయ ధీరుడు. ఒకసారి పూసపాటి వంశీకుడు అశోక్ గజపతిరాజుని, మరోసారి ఆయన కుమార్తె అతిధి గజపతిరాజుని ఓడించి ఒకే కుటుంబానికి చెక్ పెట్టిన నేతగా రికార్డు సృష్టించారు.
కోలగట్ల జగన్ కి అత్యంత సన్నితుడు. ఆయనను 2014లో ఓడినా జగన్ ఎమ్మెల్సీగా చేసారు. 2019లో మరోసారి టికెట్ ఇచ్చారు. ఆయన గెలిచి వచ్చారు. సామాజిక రాజకీయ సమీకరణలలో భాగంగా ఆయనకు మంత్రి పదవి దక్కకపోయినా డిప్యూటీ స్పీకర్ పదవి వరించింది. దాంతోనే ఆయన అధికార దర్జాను చూపించారు.
ఇటీవల ముగిసిన 2024 ఎన్నికల్లోనూ గెలుస్తాను అని అనుకున్నారు. కానీ ఆయన అంచనా తప్పు అయింది, ఓటమి పాలు అయ్యారు. ఆనాటి నుంచి కోలగట్ల చడీ చప్పుడు చేయడం లేదు. ఆయన ఫుల్ గా సైలెంట్ అయ్యారు. ఆయన ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియదు అని అంటున్నారు.
అధికారంలో ఉన్నపుడు ప్రతీ రోజూ హడావుడి చేసే ఈ నేత ఇపుడు కనిపించడంలేదేంటి అని అంతా అనుకునే పరిస్థితి ఉంది. కోలగట్ల సొంత కోటరీని నమ్మి ఓటమి పాలు అయ్యారు అని అంటున్నారు. చుట్టూ ఉన్న వారే కొంప ముంచారు అని అంటున్నారు. దాంతో ఆయన డీలా పడిపోయారు అని అంటున్నారు. ఆయన తన కుమార్తెను రాజకీయ వారసురాలిగా చూడాలని అనుకుంటున్నారు. కోలగట్ల కుమార్తె విజయనగరం కార్పోరేషన్ లో డిప్యూటీ మేయర్ గా ఉంటున్నారు. ఇపుడు ఆమె కూడా తండ్రి మాదిరిగానే సైలెంట్ అయ్యారు.
పార్టీ కార్యక్రమాలలో కూడా పెద్దగా పాల్గొనడం లేదు అని అంటున్నారు. సీనియర్లు అంతా మెల్లగా జనంలోకి వస్తున్నా కోలగట్ల అయితే ఇంకా ఓటమి భారం నుంచి బయటపడలేకపోతున్నారు అని అంటున్నారు. కోలగట్ల ఎపుడు జనంలోకి వస్తారు అన్నదే పార్టీ క్యాడర్ ఎదురుచూస్తోంది. జిల్లాలో కీలక నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్న అధినాయకత్వం చురుకైన నేతల అన్వేషణలో ఉంది. వీరభద్రస్వామి మళ్లీ రాజకీయంగా దూకుడు చేసేది ఎపుడో అంటున్నారు అంతా.
Call boy works 8341510897
కోలగట్ల జగన్ కి అత్యంత సన్నిహితుడు … అని నువ్వు రాసినప్పుడే అర్థమయింది.. ఇంకొకడు జంప్ జిలాని..
ఇద్దరు అబ్బా కూతుళ్లు అధికారాన్ని అల్లుడు హోల్ సేల్ గా ఎంజాయ్ చేస్తే మండిన క్యాడర్ టీడీపీ వైపు జారుకున్నారు…. ఇద్దరు ఓపెనింగ్ (విజయనగరం లో చిన్న మొబైల్ దుకాణం కర్రీ పాయింట్ ఓపెనింగ్ కూడా వదల్లేదు) ల హడావిడి లో పడి పార్టీ సంగతి క్యాడర్ సంగతి మర్చిపోయారు క్యాడర్ ఏమో బొత్స, చిన్న శ్రీను, టీడీపీ ల మధ్య లో చీలిపోయినది
vc estanu 9380537747
vc available 9380537747