కోనసీమ మండుతోంది

కరవమంటే కప్పకు…విడవమంటే పాముకు కోపం అన్నట్లు తయారయింది కోనసీమ జిల్లా పేరు సమస్య. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినపుడే పేరు పెట్టేసి వుంటే ఎలా వుండేదో? అప్పుడు వదిలేసారు. ఈ లోగా జనాల నుంచి…

కరవమంటే కప్పకు…విడవమంటే పాముకు కోపం అన్నట్లు తయారయింది కోనసీమ జిల్లా పేరు సమస్య. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినపుడే పేరు పెట్టేసి వుంటే ఎలా వుండేదో? అప్పుడు వదిలేసారు. ఈ లోగా జనాల నుంచి డిమాండ్ వచ్చింది. 

ప్రతిపక్షాలు కూడా అంబేద్కర్ పేరు పెట్టలేదంటూ విమర్శించాయి. దాంతో ప్రభుత్వం కార్నర్ లో పడింది. వైఎస్ పేరు, ఎన్టీఆర్ పేరు వాడారు. అంబేద్కర్ పేరు వాడలేదు అనేసరికి ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఎదురైందో లేక దీని వెనుక ఏదైనా పొలిటికల్ మోటివ్ వుందో మొత్తానికి నిర్ణయం తీసుకున్నారు.

దాంతో పచ్చని కోనసీమ భగ్గుమంది. ఆందోళనలు మొదలయ్యాయి. కోనసీమకు పాత పేరే వుంచాలంటూ మొదలైన ఆందోళన హింసాత్మకంగా మారుతోంది. పోలీసుల మీద రాళ్లు రువ్వడాలు, అధికార పార్టీ నాయకుల ఇళ్ల మీద దాడులు చేయడం వరకు వచ్చింది. 

ఇది ఎంత వరకు వెళ్తుంది? దీని వెనుక ప్రతిపక్షాల ప్రోద్బలం ఏమైనా వుందా? అన్నది తెలియాల్సి వుంది. మొత్తానికి హింస అయితే మొదలయింది. ఇది ఎక్కడికి వెళ్లి ఆగుతుందో చూడాలి. 

ఇప్పుడు ప్రభుత్వం వెనక్కు అడుగువేస్తే రెండో వర్గం నుంచి ఆందోళన మొదలయ్యే ప్రమాదం వుంది. అందువల్ల అడుగు వేసేసారు కనుక చాలా జాగ్రత్తగా వెనక్కు తీసుకోవడమో లేక సముదాయించడమో చేయాల్సి వుంది.