ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో చాలా మంది ఏ పనిలో ఉన్నా.. సెల్ఫీలు, వీడియోలు తీసుకోవడం అలవాటైంది. ప్రతి క్షణాన్ని తమ ఫోన్లలో బంధించడం, చివరకు వారి ప్రతిభను అంతా జోడించి దాన్ని వినూత్నంగా ఎడిట్ చేసుకోవడం కామన్ అయిపోయింది. అలాంటి వారికి పక్కవారి మనోభావాలు గట్రా ఏమీ గుర్తుకు రావు… అలాంటి వాడు సభ్య సమాజం సిగ్గుపడేలా భార్యభర్తలిద్దరి వ్యక్తిగత అంశమైన కార్యాన్ని.. ఓ నికృష్టపు భర్త ప్రజలందరికీ తెలిసేలా చేశాడు.
అసలేం జరిగిందంటే.. ఏపీలోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని ఓ తీరగ్రామంలో ఇటీవల యువకుడు(20), బాలిక(17) వివాహం జరిగింది. కలిసి కాపురం చేస్తామని ప్రమాణం చేసిన భర్తే ఆమె అత్మ గౌరవం దెబ్బతినేలా చేశాడు. సభ్య సమాజం సిగ్గుపడేలా కట్టుకున్న భార్యతో ఫస్ట్ నైట్ గడిపిన దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ దృశ్యాలు వైరల్ కావడంతో విషయం తెలిసిన భార్య.. భర్తను ఛీకొట్టి పుట్టింటికి వెళ్లి.. తల్లి దండ్రుల సహాయంతో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
విషయం ఊరంతా పాకడంతో.. యువకుడి బంధువులు కుల పెద్దలతో రాజీ చేయలని ప్రయత్నించిన యువతి తన తల్లిదండ్రుల సాయంతో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసి.. తన భర్తనే అరెస్ట్ చేయించింది. ఈ విషయం తెలిసిన వారు 'వాడు మనిషా, పశువా' అంటు కామెంట్లు చేస్తున్నారు.