దక్షిణం వైపు చూస్తున్న కొణతాల?

అనకాపల్లి ఎంపీ సీటు తనకే అని గట్టిగా ఫిక్స్ అయి జనసేనలో చేరిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆశలకు పెద్ద బ్రేక్ వేసేశారు కొణిదెల నాగబాబు. ఆయన సడెన్ గా ఎంట్రీ ఇచ్చి…

అనకాపల్లి ఎంపీ సీటు తనకే అని గట్టిగా ఫిక్స్ అయి జనసేనలో చేరిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆశలకు పెద్ద బ్రేక్ వేసేశారు కొణిదెల నాగబాబు. ఆయన సడెన్ గా ఎంట్రీ ఇచ్చి అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిగా ఖరారు అయిపోయారు అని ప్రచారం సాగుతోంది. నాగబాబుని గెలిపించే బాధ్యతలను కొణతాల వహించాల్సి ఉంది అని అంటున్నారు.

ఇదే విషయం ఆయనకు చెప్పి భవిష్యత్తు హామీలను ఇవ్వడానికే ఆయన ఇంటికి పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లారని అంటున్నారు. కొణతాలకు వీలుంటే అసెంబ్లీ సీటు కూడా ఇస్తామని చెప్పారని అంటున్నారు. అనకాపల్లి అసెంబ్లీ టికెట్ కొణతాలకే అని అన్నారని కూడా చెప్పుకుంటున్నారు.

అయితే అనకాపల్లి టీడీపీ అభ్యర్ధిగా రేసులో ముందంజలో కొణతాల వియ్యకుడు, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఉన్నారు. అక్కడ ఏ విధంగానూ కుదరదు అన్నది సీనియర్ నేత కొణతాలకు కూడా తెలుసు అంటున్నారు.

దాంతో ఆయన వేరే సీటు వెతుకులాటలో పడ్డారా అన్న టాక్ నడుస్తోంది. కొణతాల ఉమ్మడి విశాఖ జిల్లా మంత్రిగా పనిచేశారు. ఆయనకు సిటీతో కూడా మంచి అనుబంధం ఉంది. దాంతో ఆయన విశాఖ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారా అన్నది కూడా అంతా అనుకుంటున్నారు.

దక్షిణ నియోజకవర్గం పర్యటనకు వెళ్ళిన కొణతాల అక్కడ ఉన్న జనసేన నేతలను కలసి రాజకీయంగా ఏమి జరుగుతోంది అన్నది వాకబు చేశారు అని అంటున్నారు. పొత్తులో భాగంగా విశాఖ సౌత్ సీటు కూడా జనసేన కోరుతోంది అని ప్రచారంలో ఉంది. అలా ఆ సీటు కనుక ఇస్తే పోటీ చేసేందుకు కొణతాల రెడీ అవుతున్నారా అన్నది జనసేనతో పాటు టీడీపీలో కొత్త చర్చకు తెర లేస్తోంది.

ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలన్నది కొణతాల కోరిక అని అంటున్నారు. మరో అయిదేళ్ళు అన్నది అంటే కుదిరే వ్యవహారం కాదు అన్నది చాలా మంది సీనియర్ నేతలకు ఉన్న అభిప్రాయమే. కొణతాల ఉన్నట్లుండి సౌత్ వైపు ఎందుకు చూస్తున్నారు అన్నదే ఇపుడు జనసేన టీడీపీలో హాట్ టాపిక్ గా ఉందిట.