కూన వర్సెస్ అచ్చెన్న

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు శాసనసభా వేదికగా విభేదాలను బాహాటం చేసుకుంటున్నారా అన్నది అంతా ఆలోచిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆముదాలవలసకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కూన…

శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు శాసనసభా వేదికగా విభేదాలను బాహాటం చేసుకుంటున్నారా అన్నది అంతా ఆలోచిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆముదాలవలసకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ల మధ్య ఏమైనా విషయాలు ఉన్నాయా అని అంతా తర్కించుకుంటున్నారు.

అసెంబ్లీలో బుధవారం మరోసారి కూన వర్సెస్ అచ్చెన్నాయుడుగా వ్యవహారం సాగింది. ఐస్ లైండ్ రిఫ్రిజిరేటర్లు కొనుగోలులో అక్రమాలు జరిగాయని సొంత ప్రభుత్వం మీదనే కూన రవికుమార్ ఆరోపించారు. లక్షా 30 వేలకు పొరుగు రాష్ట్రాల్లో ఈ రిఫ్రిజరేటర్లు దొరుకుంతూంటే ఏపీలో మాత్రం రెండు లక్షల నాలుగు వేలు పెట్టి ఎందుకు కొనుగోలు చేశారు అని కూన రవికుమార్ నిలదీశారు.

ఈ కొనుగోలులో గోద్రెజ్ లాంటి కంపెనీని కూడా పక్కన పెట్టి కోల్డ్ చైన్ వంటి కంపెనీలకు ఎందుకు అనుమతించారు అని కూన కీలకమైన ప్రశ్నలను సంధించారు. దానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బదులిస్తూ ఐ లైండ్ రిఫ్రిజరేటర్లు హారిజాంటల్, వర్టికల్ అని రెండు మోడల్స్ ఉంటాయని చెప్పారు. హారిజాంటల్ రిఫ్రిజరేటర్ ఐస్ లైండ్ రిఫ్రిజిరేటర్లు మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరిందని చెప్పారు.

ఈ విషయంలో ఫార్ట్యూన్ అన్న కంపెనీ ఎల్ వన్ గా కోట్ చేయడంతో వారికే టెండర్ వచ్చిందని చెప్పారు. మహారాష్ట్రలో లక్షా 84 వేలు, కర్ణాటకలో 2 లక్షల 27 వేల రూపాయలకు రిఫ్రిజిరేటర్లు కొన్నారని మంత్రి చెప్పారు. గోద్రేజ్ కంపెనీ వారికి టెండర్ కోట్ చేసినా రాలేదని రాద్ధాంతం చేసినట్లుగా తమ దృష్టికి వచ్చినట్లుగా మంత్రి సభకు వివరించారు.

అయితే సభ్యులకు ఈ కొనుగోళ్ల విషయంలో అనుమానాలు ఉన్నాయని మరోసారి విచారణ జరిపిస్తామని అచ్చెన్నాయుడు సభకు తెలిపారు. ఈ విషయం ఇలా ఉంటే ఇంతకు రెండు మూడు రోజుల క్రితం కూడా తమ ప్రశ్నలకు మంత్రులు నోట్ చేసుకుని జవాబులు ఇవ్వడం లేదని కూన రవికుమార్ ఆరోపించడం అచ్చెన్నాయుడు దానికి బదులివ్వడం జరిగాయి. దీనిని బట్టి చూస్తూంటే టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి మధ్య కోల్డ్ వార్ ఏదో సాగుతోందని అంటున్నారు.

4 Replies to “కూన వర్సెస్ అచ్చెన్న”

    1. ఎలా నీచంగా.. వరద బాధితుల సహాయార్థం దాతలు ఇచ్చిన కోట్ల రూపాయల సొమ్ము.. మొత్తం D3 nG3s! అందులో.. కేవలం.. అగ్గిపెట్టెలు మాత్రమే.. 20 కోట్లు ఖర్చుపెట్టినట్టు.. గజ D0 nG@ లెక్కలు చెప్పటం లాగ??

      సరైన టైం లో.. భలే.. వచ్చి. కామెడీ చేస్తావు ర.. నువ్వు B0 G@ M గాడివి !

Comments are closed.